Delhi Capitals : కప్పు కొట్టేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ మాస్టర్ ప్లాన్..! పాంటింగ్ ప్లేస్‌లో యువరాజ్ సింగ్?
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు అన్ని ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

Yuvi Singh could become Delhi Capitals head coach for IPL 2025 season Reports
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు అన్ని ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ప్లేయర్లతో పాటు తమ సపోర్టింగ్ స్టాఫ్‌లోనూ భారీ మార్పులు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటికే తమ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పై వేటు వేసింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్పు కొట్టని ఢిల్లీ ఈ సారి ఎలాగైనా ఐపీఎల్ విజేతగా నిలవాలని ఆరాటపడుతోంది.
అటు గుజరాత్ టైటాన్స్ జట్టు సైతం తమ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాను తప్పించనుందనే వార్తలు వస్తున్నాయి. అతడి స్థానంలో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను తీసుకోనున్నారని టాక్ కొన్నాళ్లుగా నడుస్తోంది. అయితే.. తాజాగా స్పోర్ట్‌స్టార్ వెల్లడించిన ఓ కథనం మేరకు యువీ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా నియమితుడు కానున్నాడని పేర్కొంది.
Rohit Sharma : మరోసారి తండ్రి కాబోతున్న టీమ్ఇండియా కెప్టెన్..? రితికా నిజంగానే ప్రెగ్నెంటా..?
ఇందుకు సంబంధించి యువీతో డీసీ యాజమాన్యం చర్చలు మొదలుపెట్టిందని చెప్పింది. అయితే.. ఇంకా ఫైనల్ కాలేదని పేర్కొంది. కాగా.. దీనిపై అటు యువరాజ్ సింగ్ నుంచి గానీ, ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కాగా.. యువరాజ్ సింగ్ కు ఇప్పటి వరకు హెడ్ కోచ్‌గా పని చేసిన అనుభవం లేదు. అయినప్పటికి యువ క్రికెటర్లను తీర్చిదిద్దడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి వారు యువీ వద్ద శిక్షణ పొందిన వారే కావడం గమనార్హం.
Nicholas Pooran : టీ20ల్లో పూరన్ విధ్వంసం.. సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల రికార్డు బద్దలు..
ఐపీఎల్ 2025 ముందు మెగా వేలం జరగనుంది. ఈ ఏడాది చివరిలో వేలాన్ని నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తోంది. ఇందుకోసం ఇటీవల ముంబైలోని ప్రధాన కార్యాలయంలో అన్ని ఫ్రాంచైజీల యాజమానులతో బీసీసీఐ అధికారులు సమావేశం అయ్యారు. రిటెన్షన్ పాలసీ, ఇంపాక్ట్ రూల్ వంటి వాటిపై చర్చించినట్లుగా తెలుస్తోంది.