Nicholas Pooran : టీ20ల్లో పూరన్ విధ్వంసం.. సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల రికార్డు బద్దలు..
వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు నికోలస్ పూరన్ అరుదైన ఘనత సాధించాడు.

Nicholas Pooran goes past Suryakumar Yadav joins elite T20I list
Nicholas Pooran -Suryakumar Yadav : వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు నికోలస్ పూరన్ అరుదైన ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఈ ఘనత అందుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్, టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ లను అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో పూరన్ 26 బంతులను ఎదుర్కొన్నాడు. 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 65 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇక టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్టిల్ రెండో స్థానంలో నిలిచాడు. నికోలస్ మూడో స్థానంలో ఉండగా ఆ తరువాత జోస్ బట్లర్, సూర్యకుమార్ యాదవ్‌లు ఉన్నారు.
National Film Awards : ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో అల్లు అర్జున్, రాజమౌళి..
టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు..
* రోహిత్ శర్మ – 159 టీ20ల్లో 205 సిక్సర్లు
* మార్టిన్ గప్టిల్ – 122 టీ20ల్లో 173 సిక్సర్లు
* నికోలస్ పూరన్ – 96 టీ20ల్లో 139 సిక్సర్లు
* జోస్ బట్లర్ – 124 టీ20ల్లో 137 సిక్సర్లు
* సూర్యకుమార్ యాదవ్ – 71 టీ20ల్లో 136 సిక్సర్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. సఫారీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్(76) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం నికోలస్ పూరన్‌తో పాటు షైహోప్ (51)లు చెలరేగడంతో లక్ష్యాన్ని విండీస్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.