Rohit Sharma : మరోసారి తండ్రి కాబోతున్న టీమ్ఇండియా కెప్టెన్..? రితికా నిజంగానే ప్రెగ్నెంటా..?
శ్రీలంక పర్యటన తరువాత 40 రోజులకు పైగా విరామం దొరకడంతో తన కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నాడు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.

Rohit Sharma And Ritika Sajdeh Expecting Their Second Child
Rohit Sharma- Ritika Sajdeh : శ్రీలంక పర్యటన తరువాత 40 రోజులకు పైగా విరామం దొరకడంతో తన కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నాడు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆటకు సుదీర్ఘ విరామం దొరకడంతో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. తాజాగా CEAT క్రికెటర్ రేటింగ్ అవార్డులకు తన భార్య రితికా సజ్దేతో కలిసి హాజరు అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రెండో సారి తండ్రి కాబోతున్నాడని అంటున్నారు. రితికా చిన్నపాటి బేబీ బంప్‌తో కనిపించిదని చెబుతున్నారు. త్వరలోనే జూనియర్ హిట్‌మ్యాన్‌కు జన్మనివ్వబోతుందని కామెంట్లు పెడుతున్నారు. అయితే.. దీనిపై రోహిత్ గానీ లేదంటే రితికా గానీ స్పందిస్తేనే అసలు నిజం ఏంటీ అనేది తెలుస్తోంది.
రోహిత్ శర్మ, రితికా సజ్దేల వివాహం 15 డిసెంబర్ 2015లో జరిగింది. పెళ్లికి ముందు కొన్ని సంవత్సరాల పాటు వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. 30 డిసెంబర్ 2018లో వీరికి కూతురు పుట్టింది. ఆ పాపకు సమైరా అని పేరు పెట్టారు.
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌ను అందించిన అనంతరం పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం హిట్‌మ్యాన్ వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్ బరిలోకి దిగనున్నాడు.
Junior Hitman ????? pic.twitter.com/7CQCXsHy2i
— ???????⁴⁵ (@rushiii_12) August 23, 2024