MS Dhoni : ధోని భయ్యా.. అది క్రికెట్ బాల్ కాదు.. కాస్త చిన్నగా కొట్టవయ్యా..
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

MS Dhoni Spotted On Badminton Court Video Viral
MS Dhoni-Badminton Court : టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై నాలుగేళ్లు కావొస్తున్నా అతడి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తరువాత నుంచి ప్రతి సీజన్ అతడికి చివరిది అని ప్రచారం జరుగుతున్నా ధోని మాత్రం ఆడుతూనే వస్తున్నాడు.
ప్రస్తుతం తన కుటుంబం, మిత్రులతో కలిసి ధోని సరదాగా గడుపుతున్నాడు. తాజాగా ధోని బ్మాడ్మింటన్ ఆడుతూ కనిపించాడు. కెరీర్ ముగింపు దశకు చేరుకున్నప్పటికీ కూడా ఫిట్‌నెస్ పట్ల అతడికి ఉన్న అంకితభావానికి ఈ వీడియో నిదర్శనం అని చెప్పొచ్చు.
ఈ వీడియోలో ధోని చాలా బలంగా స్మాష్ కొట్టాడు. ఈ వీడియో వైరల్‌గా మారగా.. మహీ భాయ్ అది క్రికెట్ బాల్ కాదు కాస్త చిన్నగా కొట్టవయ్యా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ధోని ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో మోకాలి నొప్పితోనే మ్యాచులు ఆడాడు. ఈ క్రమంలో అతడు ఏ సమయంలోనైనా రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్‌లో ధోని ఆడతాడో లేదో అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఐపీఎల్ 18వ సీజన్‌కు ముందు ఈ ఏడాది మెగా వేలం జరగనుంది. ఆటగాళ్ల రిటైన్షన్ పాలసీ పై బీసీసీఐ తీసుకునే నిర్ణయం తరువాత తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడిస్తానని ఇటీవల ఓ సందర్భంలో ధోని వెల్లడించిన సంగతి తెలిసిందే.
Shaheen Afridi : తండ్రి అయ్యాక మొదటి వికెట్.. పాక్ పేసర్ సెలబ్రేషన్స్ చూశారా..?
Mahi Smashing Hard in Badminton ! ??#MSDhoni #WhistlePodu #Dhoni @msdhoni
? via abhishek pic.twitter.com/X2QMPi2nGj— TEAM MS DHONI #Dhoni (@imDhoni_fc) August 24, 2024