కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటనపై నిరసనల వేళ.. మోదీ కీలక వ్యాఖ్యలు

కఠిన శిక్షలు విధించేలా తాము చట్టాలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.

Narendra Modi

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ ప్రధాని మోదీ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని జలగావ్‌లో జరిగిన ‘లఖ్‌పతి దీదీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలపై నేరాల కేసులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మహిళల భద్రత చాలా ముఖ్యమని, వారిపై జరిగే నేరాలు క్షమించరానివని తాను ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి చెబుతానని అన్నారు. దోషులు ఎవరైనా సరే, వారిని విడిచిపెట్టకూడదని అన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించేలా తాము చట్టాలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఏ ప్రభుత్వమూ మహిళల కోసం చేయనంత మంచిని గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం చేసిందని మోదీ చెప్పుకొచ్చారు. 2014 వరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.25,000 కోట్ల కంటే తక్కువ రుణాలను ఇచ్చారని, తమ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలోనే రూ.9 లక్షల కోట్లు అందించిందని తెలిపారు.

Also Read: బాలకృష్ణ వ్యాఖ్యలను వక్రీకరించాల్సిన అవసరం లేదు: విష్ణువర్ధన్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు