గూగుల్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసిపడేసిన యువకుడు.. వైరల్ అవుతున్న పోస్ట్

అతడు ఇతర వృత్తిపరమైన పనులు చేస్తున్నాడు. ఈ విషయం గూగుల్ లీగల్ విభాగం వరకు వెళ్లిన తర్వాత తనకు “ఇక ఎలాంటి మార్గం మిగల్లేదు” అని అనిపించి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పాడు.

గూగుల్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసిపడేసిన యువకుడు.. వైరల్ అవుతున్న పోస్ట్

Bengaluru Techie (Image Credit To Original Source)

Updated On : January 12, 2026 / 10:00 AM IST

Bengaluru Techie: గూగుల్‌ వంటి కంపెనీలో జాబ్‌ వస్తే ఎంతో అదృష్టంగా భావిస్తారు. అటువంటి కంపెనీని చాలా మంది రిటైర్ అయ్యేదాకా వదులుకోరు. అయితే, బెంగళూరులో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అర్పిత్ భయానీ మాత్రం రాజీనామా చేసిపడేశాడు. అతడు గూగుల్‌ ఆఫీస్‌లో పనిముగిశాక బయట ఇతర పని చేసుకుంటున్నాడు.

ఇతర పని కూడా చేసుకుంటున్న నేపథ్యంలో గూగుల్‌ నుంచి ఇంటర్నల్‌ పాలసీ నిబంధనలు, చట్టపరమైన సమీక్ష వంటివి అతడికి అడ్డువస్తున్నాయి. దీంతో రాజీనామా చేశానని తెలిపాడు.

ఈ విషయం గూగుల్ లీగల్ విభాగం వరకు వెళ్లిన తర్వాత తనకు “ఇక ఎలాంటి మార్గం మిగల్లేదు” అని అనిపించి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పాడు.

అర్పిత్ భయానీ ఏం చెప్పాడు? 
అర్పిత్ భయానీ ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్స్‌లో తెలిపాడు. “నిన్న గూగుల్‌లో నా చివరి రోజు. ఇది ఆనందం, బాధ కలగలసిన అంశం కాదు. పూర్తిగా బాధాకరమైన పరిస్థితి మాత్రమే. నేను వెళ్లిపోవాలని ప్లాన్ వేసుకోలేదు, కానీ నాకు వేరే మార్గం లేదు.

నా బయటి పని (కోర్సులు, యూట్యూబ్‌) విషయంలో వచ్చిన వివాదం కారణంగా నేను వెళ్లిపోవాల్సి వచ్చింది. ఒకసారి చట్టపరమైన అంశంలో చిక్కుకుంటే చేయగలిగేది ఏమీ ఉండదు.

నాకు ఎంతో ఇష్టమైన ఇన్-మెమరీ డేటాబేస్‌ల డొమైన్‌ను వదిలి రావడం బాధగా ఉంది. ప్రతిభావంతులైన ఇంజినీర్లతో, మంచి మనుషులతో కలిసి పనిచేసే ఎక్స్‌పీరియన్స్‌ను వదులుకోవడం బాధగా ఉంది. ఇంకా చాలా మంచి పనులు చేయాల్సి ఉండగానే గూగుల్‌లో నా జర్నీ ముగియడంతో నాలో మరింత బాధగా పెరిగింది.

రెండు సార్లు అవకాశం ఇచ్చిన గూగుల్‌కు నేను ఎప్పటికీ కృతజ్ఞుడిని. ఆ రెండు దశలు నాకు ఎంతో సంతృప్తినిచ్చాయి, నన్ను మరింత మంచి ఇంజినీర్‌గా, ఆపరేటర్‌గా తీర్చిదిద్దాయి” అని అన్నాడు. తన టీమ్‌కు థ్యాంక్స్‌ చెప్పాడు.