సునీతా విలియమ్స్ భూమికి తిరిగివచ్చే సమయాన్ని ప్రకటించిన నాసా.. ఎప్పుడంటే?

వ్యోమగాములను భూమికి తీసుకొచ్చే ప్రయత్నంలో నాసా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మాట్లాడుతూ ..

Astronauts Sunita Williams and Barry Butch

Sunita Williams : అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇద్దరు నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌ తిరిగి భూమికి చేరడానికి ఇంకా సమయం పట్టనుంది. తాజాగా వారు భూమికి తిరిగి వచ్చే తేదీని నాసా వెల్లడించింది. స్పేస్ ఎక్స్ కు చెందిన క్య్రూ డ్రాగన్ క్యాప్సుల్ లో వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో వారు బయలుదేరుతారని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ తెలిపారు. మరో ఆర్నెళ్ల పాటు ఇద్దరు వ్యోమగాములు స్పేస్ స్టేషన్ లో ఉండి మరిన్ని పరిశోధనలు, నిర్వహణ, సిస్టమ్ టెస్టింగ్ చేయనున్నారు.

Also Read : NASA Moon Train : చందమామపై చుక్.. చుక్.. బండి.. చంద్రునిపై వేగంగా నాసా పరిశోధనలు..!

బోయింగ్‌కు చెందిన స్టార్‌లైన‌ర్‌లో అమెరికాలోని ప్లోరిడా రాష్ట్రం నుంచి ఈ ఏడాది జూన్ 5వ తేదీన నాసా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. జూన్ 6వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు వ్యోమగాములు చేరుకున్నారు. అయితే, వారు వారంరోజుల్లో భూమిపైకి తిరిగిరావాల్సి ఉన్నప్పటికీ.. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ యాత్రలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాహక నౌక థ్రస్టర్లలో లోపాలు తలెత్తడంతో పాటు హీలియం లీకేజీ సమస్యగా పరిణమించింది. దీంతో అందులో ప్రయాణించడం సురక్షితం కాదని నాసా తేల్చింది. అప్పటి నుంచి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. దాదాపు 80రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న వీరిని మళ్లీ భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా రకరకాల ప్రయత్నాలు చేసింది. కానీ, అవి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు.

Also Read : Sunita Williams : అంతరిక్షంలో సునీతా విలియమ్స్.. ఆమె తిరిగి రాకపై భారత్ సాయం చేయగలదా? ఇస్రో చీఫ్ మాటల్లోనే..!

వ్యోమగాములను భూమికి తీసుకొచ్చే ప్రయత్నంలో నాసా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. అంతరిక్షయానం ఎంతో సురక్షితం, సాధారణమే అయినప్పటికీ ప్రమాదకరమే. టెస్ట్ ప్లైట్ అనేది సాధారణం, సురక్షితం కానేకాదు. వ్యోమగాములను స్పేస్ స్టేషన్ లోనే మరిన్ని రోజులు ఉంచాలని నిర్ణయించాం. వారి భద్రత దృష్ట్యా ఖాళీగానే బోయింగ్ స్టార్ లైనర్ ను కిందికి తీసుకురానున్నామని తెలిపారు. ఈ స్టార్ లైనర్ సెప్టెంబర్ లో భూమిపైకి తిరుగు ప్రయాణం ప్రారంభించనుందని బిల్ నెల్సన్ పేర్కొన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు