Sunita Williams : అంతరిక్షంలో సునీతా విలియమ్స్.. ఆమె తిరిగి రాకపై భారత్ సాయం చేయగలదా? ఇస్రో చీఫ్ మాటల్లోనే..!

Sunita Williams : స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక లోపం కారణంగా ఆమె అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు, నాసా ఆమెను సురక్షితంగా భూమికి తీసుకురావడానికి అనేక మార్గాలను అన్వేషిస్తోంది.

Sunita Williams : అంతరిక్షంలో సునీతా విలియమ్స్.. ఆమె తిరిగి రాకపై భారత్ సాయం చేయగలదా? ఇస్రో చీఫ్ మాటల్లోనే..!

Can India help in bringing NASA’s Sunita Williams back to Earth ( Image Source : Google )

Sunita Williams : భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ఈ ఏడాది జూన్‌లో అంతరిక్షంలోకి వెళ్లారు. కానీ, స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక లోపం కారణంగా ఆమె అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు, నాసా ఆమెను సురక్షితంగా భూమికి తీసుకురావడానికి అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఎందుకంటే.. ఆమె ఇప్పుడు 2 నెలలకు పైగా అంతరిక్షంలోనే ఉంది. ఆమెను తిరిగి తీసుకురావడానికి భారత్ సాయం చేయగలదా అనే ప్రశ్నకు ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్‌ సమాధానమిచ్చారు.

Read Also : Redmi Note 13 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? రెడ్‌మి నోట్ 13 5జీపై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

ఈ సమయంలో రష్యా, అమెరికా మాత్రమే ఆమెకు సహాయం చేయగలవని చెప్పారు. ఇద్దరు వ్యోమగాములు తిరిగి తీసుకురావడానికి క్రూ డ్రాగన్‌ని ఉపయోగించవచ్చునని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు. కానీ, మానవ అంతరిక్షయానం సంక్లిష్టమైనదని, జాగ్రత్తగా ప్రణాళిక, షెడ్యూల్ అవసరమని సూచించారు. బహుశా దాని కోసమే వారు ఎదురుచూస్తున్నారని సోమనాథ్ అభిప్రాయపడ్డారు.

ఆ సామర్థ్యం మాకు లేదు : ఇస్రో చీఫ్ :
బీర్‌బైసెప్స్ అనే పాడ్‌క్యాస్ట్‌లో ఇస్రో చీఫ్ మాట్లాడుతూ.. “దురదృష్టవశాత్తూ, ఈ సమయంలో భారత్ నుంచి నేరుగా ఏ సాయం అందించలేం. ఆమెను రక్షించేందుకు క్రాఫ్ట్‌ని పంపే సామర్థ్యం మాకు లేదు. అమెరికా లేదా రష్యా నుంచి మాత్రమే అది సాధ్యపడవచ్చు. అమెరికా వద్ద క్రూ డ్రాగన్ వాహనం ఉంది. రష్యాలో సోయుజ్ ఉంది. ఈ రెండింటినీ రెస్క్యూ మిషన్ కోసం ఉపయోగించవచ్చు. బుచ్ విల్మోర్‌తో పాటు నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకుపోయారని పుకార్లు వచ్చాయి.

ప్రస్తుతం పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని నేను నమ్మను. బోయింగ్ స్టార్‌లైనర్ కొన్ని క్రమరాహిత్యాలను చూపింది. అందుకే వారు జాగ్రత్తగా ఉన్నారు. స్టార్‌లైనర్‌కు ప్రారంభంలోనే చాలా సమస్యలు ఉన్నాయి. దాంతో అనేక సమస్యలకు దారితీసింది. చివరికి లాంచ్‌తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, తిరుగు ప్రయాణంలో ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే.. ఇది లాంచ్ కన్నా చాలా ప్రమాదకరమైనది’’ అని సోమనాథ్ పేర్కొన్నారు.

అంతరిక్ష నౌక భద్రతలో బోయింగ్ గ్రౌండ్ టెస్టులను నిర్వహిస్తోంది. అయితే దీని ఫలితాలు, అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. స్టార్‌లైనర్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో ప్రధాన సమస్య ఉంది. సిబ్బంది తిరిగి వచ్చే విమానానికి భద్రతా సమస్యలను లేవనెత్తింది. వ్యోమగాముల విధికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు నాసా అధికారులు సూచించారు.

ఆగస్టు చివరి నాటికి ఏదైనది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, సెప్టెంబర్ చివరిలో ఎలన్ మస్క్ స్పేస్‌ఎక్స్ క్రూ-9 మిషన్‌లోని వ్యోమగాములను తిరిగి తీసుకురావాలని నాసా యోచిస్తోంది. అయితే, వారు వచ్చే ఏడాది ప్రారంభంలో క్రూ-9లో తిరిగి వస్తారు. మరోవైపు.. నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్, ఇతర ఉన్నతాధికారులు శనివారం (ఆగస్టు 24న) సమావేశం కానున్నారు.

Read Also : TVS Jupiter 110 Launch : కొత్త టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ వచ్చేసింది.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతో తెలుసా?