TVS Jupiter 110 Launch : కొత్త టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ వచ్చేసింది.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతో తెలుసా?

TVS Jupiter 110 Launch : 2024 టీవీఎస్ జూపిటర్ స్టార్‌లైట్ బ్లూ గ్లోస్, లూనార్ వైట్ గ్లోస్, మెటోర్ రెడ్ గ్లోస్, గెలాక్టిక్ కాపర్ మ్యాటర్, టైటానియం గ్రే మ్యాట్, డాన్ బ్లూ మ్యాట్ అనే 6 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

TVS Jupiter 110 Launch : కొత్త టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ వచ్చేసింది.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతో తెలుసా?

New TVS Jupiter 110 Launched in India at Rs 73,700

TVS Jupiter 110 Launch : ప్రముఖ టీవీఎస్ మోటార్ కంపెనీ నుంచి కొత్త టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ వచ్చేసింది. భారత మార్కెట్లో జూపిటర్ 110 స్కూటర్ రూ.73,700 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇప్పటికే 65లక్షల యూనిట్లకు పైగా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌లలో టీవీఎస్ జూపిటర్ 110 ఒకటిగా నిలిచింది.

అంతేకాదు.. హోండా యాక్టివా, హీరో జూమ్ వంటి వాటికి పోటీగా నిలుస్తోంది. 2024 టీవీఎస్ జూపిటర్ స్టార్‌లైట్ బ్లూ గ్లోస్, లూనార్ వైట్ గ్లోస్, మెటోర్ రెడ్ గ్లోస్, గెలాక్టిక్ కాపర్ మ్యాటర్, టైటానియం గ్రే మ్యాట్, డాన్ బ్లూ మ్యాట్ అనే 6 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. డ్రమ్, డ్రమ్ అల్లాయ్, డ్రమ్ ఎస్ఎక్స్‌సీ, డిస్క్ ఎస్‌ఎక్స్‌‌సీ అనే 4 వేరియంట్‌లలో అందిస్తోంది.

టీవీఎస్ జూపిటర్ స్పెషిఫికేషన్లు :
కొత్త టీవీఎస్ జూపిటర్ లేటెస్ట్ 113.3సీసీ, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఎఫ్ఐ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. ఐజీఓ అసిస్ట్‌తో 8పీఎస్ గరిష్ట శక్తిని 9.8ఎన్ఎమ్ గరిష్ట టార్క్, అది లేకుండా 9.2ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ సీవీటీతో వస్తుంది. స్కూటర్ ముందు మోడల్ కన్నా 10శాతం మెరుగైన మైలేజీని కలిగి ఉంది. ఐజీఓ అసిస్ట్ టెక్నాలజీతో వస్తుంది. ఆటో స్టార్ట్-స్టాప్ యాక్టివిటీతో కూడిన ఇంటెలిజెంట్ ఇగ్నిషన్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ISG)ని కలిగి ఉంది.

2024 టీవీఎస్ జూపిటర్ 110 టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ గ్యాస్-ఫిల్డ్ ఎమల్షన్ డంపర్‌ని పొందుతుంది. ట్యూబ్‌లెస్ టైర్‌లతో 12-అంగుళాల వీల్స్‌పై రన్ అవుతుంది. బ్రేకింగ్ విధులకు ముందువైపు 220ఎమ్ఎమ్ డిస్క్, వెనుకవైపు 130ఎమ్ఎమ్ డ్రమ్ ఉన్నాయి. ఇప్పుడు బాడీ బ్యాలెన్స్ టెక్నాలజీ 2.0ని కలిగి ఉంది. ఫార్వర్డ్, లోయర్, మోర్ సెంట్రల్ మాస్ పొజిషన్‌కు ఇంజినీరింగ్ అయింది.

స్కూటర్ కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్‌తో రీడిజైన్ ఫ్రంట్‌ను కలిగి ఉంది. టైల్యాంప్ ఒక ఎల్ఈడీ యూనిట్. పియానో ​​బ్లాక్ ఫినిషింగ్, సిగ్నేచర్ ఇన్ఫినిటీ లైట్లు స్కూటర్‌ను ప్రీమియంగా కనిపిస్తుంది. స్మార్ట్ వార్నింగ్, యావరేజ్ రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్స్, ఫుల్-డిజిటల్ కలర్ ఎల్‌సీడీ స్పీడోమీటర్‌తో కూడా వస్తుంది. కొత్త టీవీఎస్ జూపిటర్ 110లో సెక్యూరిటీ, ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

  • మెటల్ ఫ్యూయిల్ ట్యాంక్, ఫ్రంట్ ఫెండర్, సైడ్ ప్యానెల్స్
  • డ్యూయల్ హెల్మెట్ స్పేస్
  • అత్యవసర బ్రేక్ వార్నింగ్
  • టర్న్ సిగ్నల్ లాంప్ రీసెట్
  • ఫాలో మి హెడ్‌ల్యాంప్

Read Also : Redmi Note 13 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? రెడ్‌మి నోట్ 13 5జీపై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?