Viral Video : బాబోయ్..! మహిళలూ బైక్ పై ప్రయాణించేటప్పుడు జాగ్రత్త.. ఈ వీడియో చూడండి..

సునీత మనోహర్ కిందపడబోతుండగా స్థానికులు ఆమె వద్దకు వచ్చి మెడకు చుట్టుకున్న చున్నీని తొలగించారు. ఆ తరువాత ..

Mumbai Woman

Viral Video : బైక్ నడిపే సమయంలో చిన్నపాటి పొరపాటు కారణంగా పెద్ద ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళలు బైక్ నడిపే సమయంలో, వేరేవారు డ్రైవ్ చేస్తుండగా బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఓ యువతి బైక్ నడుపుతున్న సమయంలో కొద్దిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సదరు యువతి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : Viral video : పొలంలో భారీ కొండచిలువ.. ఓ ఆటాడుకున్న యువతి.. వీడియో వైరల్

సునీతా మనోహర్ అనే యువతి బైక్ రైడ్ కు సంబంధించిన, స్నేహితులతో సరదా సన్నివేశాలకు సంబంధించిన వీడియోలను తరచూ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేస్తుంది. ఆమె బైక్ నడుపుతున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. తాజాగా ఆమె ఓ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోలో.. ఆమె తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. వీడియో ప్రకారం.. సునీతా మనోహర్ ముంబైలో ప్రయాణిస్తుంది. తలకు హెల్మెంట్ ధరించింది. తన మెడలో చున్నీకూడా ఉంది. పరిమిత వేగంలోనే బైక్ ను రైడ్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమె మెడలోని చున్నీ బైక్ చైన్ బాక్స్ లో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె మెడసైతం కిందికి లాగింది. వెంటనే అప్రమత్తమైన సునీతా మనోహర్ బైక్ ను నిలిపేసింది.

Also Read : Viral Video : ఈ వీడియో చూసి న‌వ్వ‌కుండా ఉండ‌లేరు.. వీడు క్యాచ్ ప‌ట్టేలోపు అంపైర్ వెకేష‌న్‌కు వెళ్లి రావొచ్చు..

సునీత మనోహర్ కిందపడబోతుండగా స్థానికులు ఆమె వద్దకు వచ్చి మెడకు చుట్టుకున్న చున్నీని తొలగించారు. ఆ తరువాత బైక్ చైన్ కు చుట్టుకుపోయిన చున్నీని తొలగించారు. ఈ ఘటనపై సునీత మనోహర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆందోళన వ్యక్తం చేశారు. ‘నేను నెమ్మదిగా బైక్‌పై వెళుతుండగా అకస్మాత్తుగా నా చున్నీ బైక్ చైన్‌లో చిక్కుకొని మెడకు చిన్న గాయమైంది. వెంటనే నాకు సహాయం అందించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇది ఒక హెచ్చరిక.. మీరు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు, బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు చున్నీని ధరించకుండా ఉండండి. దయచేసి సురక్షితంగా ఉండండి.. నేను అదృష్టవంతురాలిని. పెద్దగాయాలు కాకుండా తృటిలో తప్పించుకున్నానని అని ఆమె పేర్కొంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. యువతి వెంటనే అప్రమత్తమై ప్రమాదం నుంచి తప్పించుకుంది. అలాంటి పరిస్థితిలో మీరు బైక్ ను బాగా కంట్రోల్ చేశారని ఆమె ప్రశంసించారు.

 

ట్రెండింగ్ వార్తలు