Viral video : పొలంలో భారీ కొండచిలువ.. ఓ ఆటాడుకున్న యువతి.. వీడియో వైరల్

ఓ యువతి పొలంలో భారీ కొండచిలువతో ఆటాడుకుంది. దాని తోకను పట్టుకొని లాగుతూ కొండచిలువకు చిరాకు తెప్పించింది.

Viral video : పొలంలో భారీ కొండచిలువ.. ఓ ఆటాడుకున్న యువతి.. వీడియో వైరల్

Girl Catch to Python

Updated On : August 25, 2024 / 10:51 AM IST

Girl Catch To Python Video Viral : మన ఇంటి పరిసరాల్లో కానీ, మనం వెళ్లేదారిలో చిన్నపాటి పాము కనిపిస్తేనే దానికి దూరంగా పరుగెడతాం. కొద్దిరోజులు అటువైపు వెళ్లేందుకు కూడా కొందరు భయపడతారు. కానీ ఓ యువతి పొలంలో భారీ కొండచిలువతో ఓ ఆటాడుకుంది. దాని తోకను పట్టుకొని లాగుతూ కొండచిలువకు చిరాకు తెప్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు యువతి చేసిన పనిపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఆ పామును ఇబ్బంది పెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Viral Video : ఈ వీడియో చూసి న‌వ్వ‌కుండా ఉండ‌లేరు.. వీడు క్యాచ్ ప‌ట్టేలోపు అంపైర్ వెకేష‌న్‌కు వెళ్లి రావొచ్చు..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. పొలంలో నీరు పారుతుంది. అదే సమయంలో అటువైపుగా భారీ కొండచిలువ వచ్చింది. దానిని చూసిన యువతి పెద్దశబ్దం చేయడంతో కొండచిలువ పొలంలో బురద నీటిలో నుంచి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో యువతి కొండచిలువ వద్దకు వెళ్లి దాని తోకను పట్టుకొని లాగే ప్రయత్నం చేసింది. అలా పలుసార్లు చేయడంతో కొండచిలువ ఒక్కసారిగా వెనక్కు తిరిగి యువతిపైకి దూసుకొచ్చింది. మళ్లీ వెనక్కుతిరిగి వెళ్లే క్రమంలో యువతి దానితోకను పట్టుకొని లాగే ప్రయత్నం చేసింది. అలా పలుసార్లు చేసినప్పటికీ యువతి చేతి నుంచి కొండచిలువ జారిపోయింది.

Also Read : Viral Video : ఆపిల్ ఐఫోన్ కోసం కొడుకు నిరాహారదీక్ష.. కండిషన్ పెట్టి కొనిచ్చిన పూలు అమ్మే తల్లి..!

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోకు 12 లక్షల వ్యూస్ వచ్చాయి. దాదాపు 11వేల మంది కామెంట్లు చేశారు. కొంతమంది నెటిజన్లు యువతి ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ కామెంట్లు చేశారు. అటవీ ప్రాంతాల పరిధిలోని గ్రామీణ ప్రాంత పొలాల్లో పనిచేసే వారు నిత్యం పాములతో పోరాడుతూనే ఉంటారు. ఆ అమ్మాయి ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ అభినందించగా.. మరికొందరు కొండచిలువ పట్ల యువతి ప్రవర్తనను తప్పుబడుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Arti Yadav (@aartiyadav7082)