CWC Meeting : హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశం.. 14 తీర్మానాలకు ఆమోదం

కులతత్వం, మతత్వం, ప్రాంతీయవాదాలు ఉండొద్దన్న మోదీ మాటలకు భిన్నంగా విధ్వేషాన్ని పెంచుతున్నారని ఫైర్. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ఫెడరల్ వ్యవస్థ విధ్వంసం.

CWC Meeting Resolutions

CWC Meeting Resolutions : హైదరాబాద్ లో జరిగిన సీడబ్ల్యూసీ మొదటి రోజు సమావేశంలో 14 తీర్మానాలకు ఆమోదం లభించింది. 1.కశ్మీర్ లో చనిపోయిన బలగాల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బలగాలు చనిపోతుంటే మోదీ 20 వేడుకల్లో ఉన్నారని ఫైర్ అయ్యారు. 2.మల్లికార్జున ఖర్గే సేవలకు, అలుపెరుగని రాజకీయ పోరాటానికి ప్రశంసలు. 3.భారత్ జోడో యాత్ర వార్షికోత్సవం సందర్భంగా ఆ స్ఫూర్తిని కొనసాగించాలని నిర్ణయం. రాహుల్ పై అనర్హత కక్షసాధింపు, చివరికి న్యాయం గెలిచిందని కామెంట్. 4.మణిపూర్ లో వ్యవస్థల వైఫల్యంపై ఖండన.

5.కులతత్వం, మతత్వం, ప్రాంతీయవాదాలు ఉండొద్దన్న మోదీ మాటలకు భిన్నంగా విధ్వేషాన్ని పెంచుతున్నారని ఫైర్. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ఫెడరల్ వ్యవస్థ విధ్వంసం. 6.కనీస మద్దతు ధర సహా రైతులకు ఇచ్చిన హామీలు తప్పారని తీర్మానం. 7.పెరుగుతున్న నిరుద్యోగంపై ఆందోళన. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కోటా పరిమితిని పెంచాలని డిమాండ్. 8.కొత్త రాజ్యాంగం, మౌలిక నిర్మాణాన్ని మార్చే ప్రయత్నాలకు వ్యతిరేకం.

CWC in Telangana: కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం తెలంగాణలోనే ఎందుకు? దీని వెనుక భారీ ప్లాన్ ఉందట.. అదేంటంటే?

9.పార్లమెంటు చర్చలు, నియంత్రణలు వదిలి, దీర్ఘకాల ప్రభావం ఉండే నిర్ణయాలను హడావుడిగా తీసుకుంటున్న తీరును ఖండిస్తూ తీర్మానం. 9 అంశాలు సూచించిన సోనియాకు అభినందన. ఈ సెషన్ లోనే మహిళా బిల్లు పెట్టి పాస్ చేయాలని డిమాండ్. 10.ఆదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్. 11.ఒకే దేశం ఒకే ఎన్నికలు ఫెడరల్ పై దాడి, విపక్ష రాష్ట్రాలకు డిజాస్టర్ నిధులు ఇవ్వకపోవడంపై ఆగ్రహం.

12.చైనా ఆక్రమణలపై ఖండన. కేంద్రం ధీటుగా వ్యవహరించాలని డిమాండ్. 13.దేశంలో మత, కుల, వర్గ సామరస్య వాతావరణాన్ని నిలబెట్టాలి. ఈ విషయంలో ప్రజలకు అండగా ఉంటాం. 14.విభజన రాజకీయలను వ్యతిరేకిస్తూ సిద్ధాంత, ఎన్నికల విషయాలు సాధించడానికి ఇండియా కూటమి కట్టుబడి ఉంది. వంటి 14 తీర్మాలను సీడబ్ల్యూసీ ఆమోదించింది.

Kishan Reddy: తెలంగాణలో ఆ పని చేసే అధికారం కాంగ్రెస్‌కు లేదు: కిషన్ రెడ్డి

హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణా వేదకగా సీడబ్ల్యూసీ తొలి సమావేశాలు ముగిశాయి. ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి సీడబ్ల్యూసీ సమావేశాలను ప్రారంభించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు