CWC in Telangana: కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం తెలంగాణలోనే ఎందుకు? దీని వెనుక భారీ ప్లాన్ ఉందట.. అదేంటంటే?

తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 129 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 29 సీట్లు గెలుచుకుంది. ఈ 29 స్థానాల్లో ఒక్క కర్ణాటక నుంచే బీజేపీకి 25 సీట్లు వచ్చాయి.

CWC Meeting in Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం రెండు రోజుల పాటు జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆగస్టు 20న కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా 39 మంది సభ్యులు ఉన్నారు. ఈ సమావేశంలో ఈ ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలపై పలు దశల్లో చర్చించనున్నారు. దక్షిణాది రాష్ట్రంలో కాంగ్రెస్ సభ నిర్వహించడానికి ప్రధాన కారణం.. దక్షిణాది నుంచే ఢిల్లీకి చేరుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండడం.

రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరికల్లా జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులను బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. వాస్తవానికి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 129 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 29 సీట్లు గెలుచుకుంది. ఈ 29 స్థానాల్లో ఒక్క కర్ణాటక నుంచే బీజేపీకి 25 సీట్లు వచ్చాయి. వ్యూహం ప్రకారం దక్షిణాదిన బీజేపీని ఇరుకున పెడితే పరిస్థితి తారుమారవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.

Terrorist Conspiracy : ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ.. దక్షిణాది రాష్ట్రాల్లోని 31 ప్రాంతాల్లో సోదాలు

రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రను దక్షిణాది నుంచే ప్రారంభించారు. ఈ ప్రయాణం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగింది. భారత్ జోడో యాత్రతో తమ మద్దతు పెరిగిందని కాంగ్రెస్ భావిస్తోంది. దక్షిణాదిలో గెలిస్తే 2024లో ఎంతో ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ నమ్ముతోంది. ఇక, వర్కింగ్ కమిటీ అనేద కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత కార్యనిర్వాహక అధికారం ఉన్న విభాగం. పార్టీలో ముఖ్యమైన నిర్ణయాలు ఈ విభాగమే తీసుకుంటుంది. రాజ్యాంగానికి సంబంధించిన ప్రతి నిర్ణయం, పార్టీ అధ్యక్షుడిని నియమించే/తొలగించే హక్కు కూడా ఈ విభాగానికే ఉంటుంది. డిసెంబర్ 1920లో మొదటిసారిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏర్పాటైంది.

దక్షిణానికి సంబంధించిన ముఖ్యమైన వాస్తవాలు
దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలలో 129 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.
ప్రస్తుతం దక్షిణాది నుంచి 29 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు.
29 మంది ఎంపీల్లో కర్ణాటక నుంచి 25 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు.
తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు.
దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో మొత్తం 923 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇందులో బీజేపీకి 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సంఖ్య 135 గా ఉండేది.
మొత్తం ఎమ్మెల్యేల్లో బీజేపీ ఎమ్మెల్యేలు కేవలం 10% మాత్రమే.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిలో 182 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఇందులో ఒక్క కర్ణాటకలోనే 135 మంది ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు