Sukesh Chandrasekhar: ఆప్ మంత్రికి రూ.10 కోట్లు, పార్టీకి రూ.50 కోట్లు ఇచ్చానని సంచలన ఆరోపణలు చేసిన సుకేశ్ చంద్రశేఖర్

సుకేశ్ చేసిన ఈ ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కొట్టి పారేశారు. గుజరాత్‌లో బీజేపీ దయనీయ పరిస్థితిలో ఉందని, ఆ కారణంగానే ఒక ఆర్థిక నేరాల మోసగాడిపై బీజేపీ ఆధారపడుతోందని, ఇది మోర్బీ విషాద ఘటనను పక్కదారి పట్టించేందుకు బీజేపీ పన్నిన కుట్ర అని అన్నారు. కాగా, సుకేశ్ లేఖ బయటికి రావడంతో విపక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీపై అరవింద్ కేజ్రీవాల్‭పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి

Sukesh Chandrasekhar: ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేంద్ర జైన్‭పై సుకేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రొటెక్షన్ మనీ కింద ఆయనకు 10 కోట్ల రూపాయలు చెల్లించానని మంగళవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‭ వినయ్ కుమార్ సక్సేనాకు రాసిన ఫిర్యాదు లేఖలో ఆరోపించారు. అంతే కాకుండా.. తనకు పార్టీలో కీలక పదవి ఇస్తానన్న హామీ మేరకు ఆప్‭కు 50 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినట్లు కూడా వెల్లడించారు. అయితే ఈ లేఖలో జైన్ తనను బెదిరించినట్లు కూడా ఆరోపించారు. హైకోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ ప్రిజన్ అండ్ జైల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ ద్వారా తనను జైన్ బెదరించినట్టు ఆ లేఖలో చంద్రశేఖర్ పేర్కొన్నారు.

‘‘2015 నుంచి సత్యేంద్ర జైన్‭తో నాకు పరిచయం ఉంది. పార్టీలో నాకు కీలక పదవి అప్పగిస్తానని, పార్టీ విస్తరణ తర్వాత రాజ్యసభకు నామినేట్ చేస్తామని ఆప్ నాకు హామీ ఇచ్చింది. దాంతో నేను ఆ పార్టీకి 50 కోట్ల రూపాయల విరాళం ఇచ్చాను. 2017లో నేను అరెస్టైన తర్వాత తీహార్ జైలుకు పంపారు. అప్పుడు జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్.. నన్ను కలిశారు. పార్టీకి ఇచ్చిన విరాళం గురించి దర్యాప్తు సంస్థలకేమైనా చెప్పావా అని ప్రశ్నించారు. ఆ తర్వాత 2019లో ఆయనే నన్ను మరోసారి జైల్లో కలిశారు. జైల్లో రక్షణ సహా ఇతర సదుపాయాలు కల్పించడానికి తనకు నెలకు రెండు కోట్ల రూపాయలు పంపాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు డీజీ సందీప్ గోయెల్‭కు ప్రతి నెలా 1.5 కోట్ల రూపాయలు బలవంతంగా కట్టించుకున్నారు. ఇలా సత్యేంద్ర జైన్‭కు 10 కోట్ల రూపాయలు, గోయెల్‭కు 12.5 కోట్ల రూపాయలు చెల్లించుకున్నాను’’ అని తాను రాసిన లేఖలో సుకేశ్ పేర్కొన్నారు.

అయితే సుకేశ్ చేసిన ఈ ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కొట్టి పారేశారు. గుజరాత్‌లో బీజేపీ దయనీయ పరిస్థితిలో ఉందని, ఆ కారణంగానే ఒక ఆర్థిక నేరాల మోసగాడిపై బీజేపీ ఆధారపడుతోందని, ఇది మోర్బీ విషాద ఘటనను పక్కదారి పట్టించేందుకు బీజేపీ పన్నిన కుట్ర అని అన్నారు. కాగా, సుకేశ్ లేఖ బయటికి రావడంతో విపక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీపై అరవింద్ కేజ్రీవాల్‭పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఆప్ నేతలంతా దోపిడీ దారులే అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Alcoholic Monkey: వైన్ షాపు ముందు బీర్లు తాగుతూ కోతి హల్‭చల్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన షాపు యజమాని

ట్రెండింగ్ వార్తలు