kind heart : బెలూన్లు అమ్ముతున్న బాలుడిని చూసి చలించి పోయిన ఐపీఎస్ ఆఫీసర్.. ఏం చేశారంటే?

చదువుకునే వయసులో ఏదో ఒక కష్టం చేస్తున్న పిల్లలు మనకి కనిపిస్తూ ఉంటారు. అలా ఓ బెలూన్లు అమ్ముతున్న బాలుడిని చూసి ఐపీఎస్ ఆఫీసర్ చలించిపోయారు. అతని పట్ల తన మంచితనం చాటుకున్నారు.

kind heart :  చదువుకునే వయసులో బెలూన్లు (balloons) అమ్ముతున్నాడు ఓ బాలుడు. అతని కష్టం ఓ ఐపీఎస్ (IPS Officer) అధికారి మనసుని కదిలించింది. వెంటనే ఆయన చేసిన పని అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఆయనేం చేశారో స్టోరీ చదవండి.

intelligent dog : ఆ శునకం మహా ముదురు .. చదివింది చేసి చూపిస్తున్న డాగ్ వీడియో వైరల్

ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) దుర్గ్‌ ఎస్పీ , ఐపీఎస్‌ అధికారి అభిషేక్‌ పల్లవ్‌‌కి (Abhishek Pallav) వీధిలో బెలూన్‌లు అమ్ముతున్న ఓ బాలుడు కనిపించాడు. అతని దగ్గరకు వెళ్లి చదువుకునే వయసులో బెలూన్లు ఎందుకు అమ్ముతున్నావని ప్రశ్నించారు. ఇక బెలూన్ల వ్యాపారం ఎలా ఉందని.. వాటి ధర ఎంతని వివరాలు అడిగారు. ఎంతో అమాయకంగా సమాధానం చెబుతున్న అతని కష్టం చూసి ఆ ఆఫీసర్ కి మనసు కదిలిపోయింది. అంతే అతనికి సాయం చేయాలి అనుకున్నారు. బాలుడి దగ్గర ఉన్న స్టాక్ మొత్తం కొనేసి అతడికి ఆనందం పంచారు. ఆయన చేసిన పని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు అభిషేక్ పల్లవ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Viral Video : వీడెవడండీ బాబూ.. మెట్రోలో దుస్తులు విప్పి ఏకంగా స్నానమే చేశాడు, వీడియో వైరల్

మీలాంటి వారి వల్ల దేశంలో పరిస్థితులు మారతాయి అని కొందరు.. మీరు చేసిన మంచి పనికి దేవుడు మీకు తోడుంటాడు అని కొందరు.. ఐపీఎస్ ఆఫీసర్ అభిషేక్ పల్లవ్ పై అభిప్రాయపడ్డారు.

 

ట్రెండింగ్ వార్తలు