Water Pipeline Bursted: పైపులైన్ పగిలి భారీగా ఎగసిపడిన నీరు.. మహిళ మృతి, 30మందికి గాయాలు.. వీడియో వైరల్

తాగునీటిని సరఫరా చేసే పైపులైన్ పగిలి భారీగా నీరు ఎగసిపడటంతో ఆ ప్రాంతం వాగును తలపించింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా, 30మందికి గాయాలయ్యాయి. పలు ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి.

Guwahati: అస్సాంలోని గౌహతిలో మున్సిపల్‌కు చెందిన నీటి సరఫరా పైపులైన్ పగిలిపోవడంతో ఒక మహిళ మృతిచెందగా, 30 మందికిపైగా గాయపడ్డారు. నీటి ఒత్తిడి కారణంగా గౌహతిలోని ఖర్గులి ప్రాంతంలో పైపులైన్ ఒక్కసారిగా పగలడంతో భారీగా నీరు ఎగసిపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

100 crore credited: ఒక్క రాత్రిలోనే కోటీశ్వరుడైన దినసరి కూలీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

పైపుల పగిలి భారీగా నీరు ఎగసిపడటంతో ఆ ప్రాంతం వాగును తలపించింది. వీధుల్లో నీటి ప్రవాహంలో ఓ మహిళ కొట్టుకుపోయి మృతిచెందింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వందలాది వాహనాలు ఈ నీటిలో కొట్టుకుపోయాయి. సుమారు 40 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో సుమారు 600 మందికిపైగా ప్రభావితమయ్యారు. ఘటన చోటుచేసుకున్న కొద్దిసేపటికి పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని స్థానికులకు సహాయం అందించారు.

Garlic Water : ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు?

ఈ ఘటనలో మృతిచెందిన మహిళను సుమిత్ర రాభాగా పోలీసులు గుర్తించారు. నీటి ప్రవాహానికి దెబ్బతిన్న ఒక ఇంటిలో ఆమె నివసిస్తుంది. ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్న బాధితులు తమకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు సాధ్యమైనంత వేగంగా నీటి సరఫరాను పునరుద్దరిస్తామని గుహవాటి మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (జీఎండీఎ) హామీ ఇచ్చింది.

 

ట్రెండింగ్ వార్తలు