MoS Rao Inderjit Singh : రాబోయే ఎన్నికల్లో మోదీని నమ్ముకుంటే కష్టమే..కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

ఈ సారి మోదీని పేరు చెప్పుకుని ఎన్నికలు వెళితే విజయం సాధించడం కష్టమేనంటూ కేంద్ర సహాయమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

MoS Rao Inderjit Singh ఈ సారి మోదీని పేరు చెప్పుకుని ఎన్నికలు వెళితే విజయం సాధించడం కష్టమేనంటూ కేంద్ర సహాయమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యాణాలో ఈ నెల 30న జరగనున్న ఎలెనాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో గురువారం కేంద్ర సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ పాల్గొన్నారు.

సీఎం మనోహర్ లాల్ ఖట్టర్,కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ మరియు హర్యానా బీజేపీ చీఫ్ ఓం ప్రకాష్ ధన్​కర్ లు పాల్గొన్న మీటింగ్ లో హర్యాణా బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన కేంద్ర సహాయమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్..తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడారు.

2014 మరియు 2019 హర్యానా ఎన్నికల్లో కేవలం ప్రధాని మోదీ పాపులారిటీ కారణంగానే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిందని రావు ఇంద్రజిత్ సింగ్ గుర్తుచేశారు. అయితే ఈసారి జరగనున్న ఎన్నికల్లో మోదీ పేరు మీద ఓట్లు వస్తాయనే గ్యారెంటీ లేద లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరు చెప్పుకుని పోటీ చేస్తే 45 సీట్లు సాధించడం కూడా సందేహమేనని అభిప్రాయపడ్డారు. పెద్ద నేతలు వస్తారు. ప్రసంగాలు చేసి వెళ్తారు.. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పనిచేసినప్పుడే వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే మోదీ కల నెరవేరుతుందని రావు ఇంద్రజిత్ సింగ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ ధన్​కర్ ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానంపై సలహాలు ఇస్తూ ఇంద్రజిత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా,యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన రావు ఇందర్ జిత్ సింగ్ 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. ఐదుసార్లు లోక్‌సభ ఎంపీ అయిన ఆయనను ఇటీవల ప్రకటించిన బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి తప్పించారు.

ALSO READ సమంత విడాకుల తర్వాత అనౌన్స్ చేసిన మొదటి సినిమా.. గట్టిగానే ప్లాన్ చేసింది

ట్రెండింగ్ వార్తలు