Mukul Kundra : రోడ్ సైడ్ పుస్తకాలు అమ్ముతూ..ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ దాకా సాగిన ఓ రచయిత అందమైన జర్నీ వీడియో వైరల్

ఓ రచయిత ప్రయాణం ఎంతో కష్టమైనది.. పుస్తకం రాసిన దగ్గర్నుంచి అది అమ్మడం వరకూ సాగే జర్నీ ఎంతో కష్టంతో కూడుకున్నది.. ముకుల్ కుంద్రా అనే రచయిత తన రచనా ప్రయాణాన్ని ఎంత అందంగా పోస్ట్ చేసాడో ఈ కథ చదవండి.

ఓ రచయితగా (author) ఎదడగం చాలా కష్టమైన ప్రయాణం. ఎంతో కష్టపడి రాయడం.. రాసిన వాటిని పుస్తకాలుగా పబ్లిష్ చేయడం.. వాటిని మార్కెట్లోకి తీసుకురావడం.. పాఠకులతో కొనిపించి చదివించగలగడం.. మరీ ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో చాలా కష్టమైన పని. ఓ రైటర్ తన పుస్తకాలు వీధిలో అమ్మడం దగ్గర్నుంచి ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో అమ్మడం వరకూ సాగిన జర్నీని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అతను షేర్ చేసిన ఆ జర్నీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Kallakurichi collector in controversy : అటెండర్‌ని షూస్ తీసుకెళ్లమంటూ కలెక్టర్ ఆర్డర్.. ఏకిపారేస్తున్నజనం వీడియో వైరల్

జీవితంలో సక్సెస్ ఎప్పుడూ యాక్సిడెంటల్‌గా రాదు. ఎంతో కష్టపడితేనే నిజమైన సక్సెస్‌ని ఆస్వాదించగలం. అందుకోసం ఎంతో నేర్చుకోవాలి.. చదవాలి.. కొన్నిటిని త్యాగం కూడా చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. వరల్డ్ ఫేమస్ ఫుడ్ బాల్ ప్లేయర్ పీలే (Pele) చెప్పిన ఈ అక్షరాలు రచయిత ముకుల్ కుంద్రాకు సరిగ్గా సూట్ అవుతాయి. అసలు తాను ఓ రచయిత కావడం.. తాను రాసిన పుస్తకాలు వీధుల్లో అమ్మడం.. అక్కడి నుంచి తన ప్రయాణం ఢిల్లీలో (delhi) జరిగిన ప్రపంచ బుక్ ఫెయిర్ (international book fair) వరకూ సాగడం అంటే మాటలా? దీని వెనుక అతను పడ్డ కష్టం ఎంతో ఉంది.

ముకుల్ కుంద్రా (mukul kundra) మంచి రైటర్. తను రాసిన ఎన్నో పుస్తకాలు అమ్మడం కోసం అతను ఎన్నో వీధుల్లో తిరిగాడు. ఎందరినో కలిసి వాటిని సేల్ చేసాడు. అలాంటిది అతని బుక్స్ ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో ఓ స్టాల్‌లో చోటు దక్కించుకుని అమ్ముడుపోవడం అంటే మమూలు విషయమా? .. ఒక రోలర్ కోస్టర్ లాగ (roller coaster) సాగిన తన జర్నీని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో చాలామందిని ఇన్ స్పైర్ చేస్తోంది.

New York metro : మెట్రోలో పరుపు వేసుకుని పడుకున్న వ్యక్తి వీడియో వైరల్

చాలామంది ఈ వీడియో చూసి స్పందిస్తున్నారు. బుక్ లవర్స్‌గా (book lovers) మిమ్మల్ని కలవాలని ఉంది అని కొందరు. మీ జర్నీ అద్భుతమైనది అని కొందరు.. మీ జర్నీ ఇలాగే కొనసాగాలని కొందరు పోస్టులు పెట్టారు.

ట్రెండింగ్ వార్తలు