One Nation One Election: దేశంలో మరో అతి పెద్ద సంస్కరణ.. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలకు సిద్ధమైన కేంద్రం?

అంటే దేశంలో మొత్తం ఒకే సారి పార్లమెంటు, అసెంబ్లీల ఎన్నికలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో...

One Nation One Election

One Nation One Election – Parliament: దేశంలో మరో అతి పెద్ద సంస్కరణకు ఎన్డీఏ (NDA) సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

అంటే దేశంలో మొత్తం ఒకే సారి పార్లమెంటు, అసెంబ్లీల ఎన్నికలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో 5 సిట్టింగ్స్ ఉంటాయని కేంద్ర సర్కారు తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు కోసమే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి చాలా కాలంగా చర్చజరుగుతోంది.

లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ బిల్లుపై అధ్యయనం జరిపింది. ఇప్పటి వరకు దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ పదవీ కాలాలు ముగిస్తే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల ఆర్థిక పరంగానే గాక మరికొన్ని విధాలుగా నష్టం వస్తుందని వాదనలు ఉన్నాయి. కాగా, ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో యూనిఫాం కోడ్, మహిళల కోటా బిల్లులు కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది.

Rahul Gandhi: అప్పుడు హిండెన్‭బర్గ్.. ఇప్పుడు ఓసీసీఆర్పీ.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే?

ట్రెండింగ్ వార్తలు