Womens T20 World Cup 2024 : క్రికెట్ అభిమానులు సిద్ధం కండి.. అక్టోబ‌ర్ 6న భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌.. దుబాయ్ వేదిక‌గా

ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ 2024కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది.

ICC announces schedule for the ICC Womens T20 World Cup

Womens T20 World Cup : అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచకప్ 2024కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. వాస్త‌వానికి ఈ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను బంగ్లాదేశ్‌లో నిర్వ‌హించాల్సి ఉంది. అయితే.. ఆ దేశంలో ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ మెగాటోర్నీని యూఏఈ వేదిక‌గా నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఐసీసీ వెల్ల‌డించ‌నుంది. అక్టోబ‌ర్ 3 నుంచి 20 వ‌ర‌కు ఈ టోర్నీ జ‌ర‌గ‌నుంది.

ఈ టోర్నీలో మొత్తం 10 జ‌ట్లు పాల్గొన‌నున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభ‌జించారు. గ్రూప్‌-ఏలో భారత్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్‌, పాకిస్తాన్ లు ఉండగా.. గ్రూప్‌-బిలో వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, స్కాట్లాండ్ జ‌ట్లు ఉన్నాయి. తొలి మ్యాచ్ అక్టోబ‌ర్ 3న స్కాట్లాండ్‌తో బంగ్లాదేశ్ త‌ల‌ప‌డ‌నుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం ఈ మ్యాచ్ మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. అదే రోజు రాత్రి 7.30 గంట‌ల‌కు పాకిస్తాన్‌తో శ్రీలంక త‌ల‌ప‌డ‌నుంది.

రావల్పిండి టెస్ట్ మ్యాచ్.. పాకిస్థాన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజుతో పాటు పాయింట్లు కూడా..

ఇక భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను అక్టోబ‌ర్ 4న న్యూజిలాండ్‌తో ఆడ‌నుంది. ఇక చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్‌తో అక్టోబ‌ర్ 6న త‌ల‌ప‌డ‌నుంది. అక్టోబ‌ర్ 17 న సెమీ ఫైన‌ల్ 1, అక్టోబ‌ర్ 18న సెమీ ఫైన‌ల్ 2 మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. అక్టోబ‌ర్ 20న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. కాగా.. ఈ మ్యాచులు అన్ని కూడా షార్జా, దుబాయ్ రెండు వేదికల్లోనే జ‌ర‌గ‌నున్నాయి.

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 షెడ్యూల్ ఇదే..

* అక్టోబర్ 3న బంగ్లాదేశ్ వ‌ర్సెస్‌ స్కాట్లాండ్ – షార్జా
* అక్టోబర్ 3న పాకిస్థాన్ వ‌ర్సెస్‌ శ్రీలంక – షార్జా
* అక్టోబర్ 4న దక్షిణాఫ్రికా వ‌ర్సెస్‌ వెస్టిండీస్ – దుబాయ్
* అక్టోబర్ 4న భార‌త్‌ వ‌ర్సెస్‌ న్యూజిలాండ్ – దుబాయ్
* అక్టోబర్ 5న బంగ్లాదేశ్ వ‌ర్సెస్ ఇంగ్లాండ్ – షార్జా
* అక్టోబర్ 5న ఆస్ట్రేలియా వ‌ర్సెస్‌ శ్రీలంక – షార్జా
* అక్టోబర్ 6న భారత్ వ‌ర్సెస్‌ పాకిస్థాన్ – దుబాయ్
* అక్టోబర్ 6న వెస్టిండీస్ వ‌ర్సెస్‌ స్కాట్లాండ్ – దుబాయ్

టెస్టుల్లో బంగ్లాదేశ్ అన్ని దేశాలపై గెలిచింది.. రెండు దేశాలపై తప్పా.. అవేంటో తెలుసా?

* అక్టోబర్ 7న ఇంగ్లాండ్ వ‌ర్సెస్‌ సౌతాఫ్రికా – షార్జా
* అక్టోబర్ 8న ఆస్ట్రేలియా వ‌ర్సెస్‌ న్యూజిలాండ్ – షార్జా
* అక్టోబర్ 9న దక్షిణాఫ్రికా వ‌ర్సెస్‌ స్కాట్లాండ్ – దుబాయ్
* అక్టోబర్ 9న భారత్ వ‌ర్సెస్‌ శ్రీలంక – దుబాయ్
* అక్టోబర్ 10న బంగ్లాదేశ్ వ‌ర్సెస్‌ వెస్టిండీస్ – షార్జా
* అక్టోబర్ 11న ఆస్ట్రేలియా వ‌ర్సెస్ పాకిస్థాన్ – దుబాయ్
* అక్టోబర్ 12న న్యూజిలాండ్ వ‌ర్సెస్‌ శ్రీలంక – షార్జా
* అక్టోబర్ 12న బంగ్లాదేశ్ వ‌ర్సెస్ సౌతాఫ్రికా – దుబాయ్
* అక్టోబర్ 13న ఇంగ్లాండ్ వ‌ర్సెస్‌ స్కాట్లాండ్ – షార్జా
* అక్టోబర్ 13న భార‌త్‌ వ‌ర్సెస్‌ ఆస్ట్రేలియా – షార్జా
* అక్టోబర్ 14న పాకిస్థాన్ వ‌ర్సెస్‌ న్యూజిలాండ్ – దుబాయ్
* అక్టోబర్ 15న ఇంగ్లాండ్ వ‌ర్సెస్‌ వెస్టిండీస్ – దుబాయ్
* అక్టోబర్ 17న సెమీఫైనల్ 1 – దుబాయ్
* అక్టోబర్ 18న సెమీఫైనల్ 2 – షార్జా
* అక్టోబర్ 20న ఫైనల్ – దుబాయ్

ట్రెండింగ్ వార్తలు