రావల్పిండి టెస్ట్ మ్యాచ్.. పాకిస్థాన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజుతో పాటు పాయింట్లు కూడా..
చిన్నజట్టు చేతిలో చిత్తుగా ఓడిపోయి విమర్శలు ఎదుర్కొంటున్న పాక్ క్రికెట్ టీమ్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

ICC Punished Pakistan Lose WTC Points And Part Of Match Fee
ICC Punished Pakistan: రావల్పిండిలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయిన పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. చిన్నజట్టు చేతిలో చిత్తుగా ఓడిపోయి విమర్శలు ఎదుర్కొంటున్న పాక్ క్రికెట్ టీమ్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేటు కారణంగా పాకిస్థాన్‌పై కొరడా ఝళిపించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 6 పాయింట్లను కోత విధించింది. కెప్టెన్ షాన్ మసూద్ తప్పుకోవడంతో పాకిస్థాన్ జట్టు మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత పెట్టింది.
స్లో ఓవర్ రేట్‌కు పాల్పడిన బంగ్లాదేశ్ జట్టుకు కూడా ఐసీసీ వాత పెట్టింది. మూడు WTC పాయింట్లతో పాటు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పెట్టింది. ఐసీసీ పాయింట్లను తగ్గించడంతో WTC పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ 8వ స్థానంలో కొనసాగుతుండగా బంగ్లాదేశ్ ఏడో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా ఒక స్థానం ఎగబాకి ప్రస్తుతం 6వ స్థానంలో ఉంది. ఇండియా టాప్ పొజిషన్‌లో ఉంది. ఆస్ట్రేలియా (2), న్యూజిలాండ్(3), ఇంగ్లండ్(4), శ్రీలంక(5) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వెస్టిండీస్ చివరి స్థానంలో కొనసాగుతోంది.
Also Read: టెస్టుల్లో బంగ్లాదేశ్ అన్ని దేశాలపై గెలిచింది.. రెండు దేశాలపై తప్పా.. అవేంటో తెలుసా?
షకీబ్ అల్ హసన్‌కు జరిమానా
రావల్పిండి టెస్ట్ మ్యాచ్‌లో సహనం కోల్పోయి దురుసుగా ప్రవర్తించిన బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై కూడా ఐసీసీ చర్య తీసుకుంది. ప్రవర్తనా నియమావళి లెవల్ 1 ఉల్లంఘించినందుకు డీమెరిట్ పాయింట్ ఇవ్వడంతో పాటు అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. రెండో ఇన్నింగ్స్ 33వ ఓవర్‌లో పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌పైకి కోపంతో బంతిని విసిరాడు. బంతి అతడికి తగలకపోవడంతో రిజ్వాన్‌కు ప్రమాదం తప్పింది. కాగా, రావల్పిండి టెస్ట్ మ్యాచ్‌లో షకీబ్ 4 వికెట్లు తీశాడు. 706 వికెట్లతో అత్యధిక అంతర్జాతీయ వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్‌గానూ షకీబ్ రికార్డుకెక్కాడు.
Also Read: ఓరి నాయనో.. షకీబ్‌కు కోపం తెచ్చావుగా.. జస్ట్ మిస్.. తల పగిలేదిగా రిజ్వాన్..!