UGC-NET Result 2024 : యూజీసీ నెట్ రిజల్ట్.. స్కోర్‌కార్డులు, కట్-ఆఫ్ మార్కులు త్వరలో విడుదల..!

UGC-NET Result 2024 : పరీక్షా ఏజెన్సీ ఆగస్టు 9న సీఎస్ఐఆర్ ఎన్ఈటీ కోసం ప్రొవిజనల్ కీని జారీ చేసింది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఆగస్టు 11 వరకు అనుమతించింది.

UGC-NET Result 2024_ Scorecards ( Image Source : Google )

UGC-NET Result 2024: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ వారంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (జాయింట్ CSIR UGC-NET) ఫలితాలను, ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేస్తుందని భావిస్తున్నారు. పరీక్షకు హాజరైన వారు ఫలితాలు ప్రకటించిన తర్వాత వారి స్కోర్‌కార్డులను యాక్సెస్ చేయగలరు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ (csirnet.nta.ac. in)లో అందుబాటులో ఉంటాయి.

సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2024 రిజల్ట్స్ : స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయాలంటే? :

  • అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.ac.in విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీలో “జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ-నెట్ రిజల్ట్స్ 2024” అనే లింక్‌ని ఎంచుకోండి.
  • మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వంటి అవసరమైన లాగిన్ వివరాలను రిజిస్టర్ చేయండి.
  • వివరాలను సమర్పించండి. మీ రిజల్ట్స్ కనిపిస్తుంది.
  • స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసి, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేయండి.

ఫలితాలు విడుదలైన తర్వాత అర్హత పొందిన అభ్యర్థులు ఎన్‌టీఏ నుంచి వారి సర్టిఫికేట్‌లు, జేఆర్ఎఫ్ అవార్డు లేఖలను అందుకుంటారు. పరీక్షా ఏజెన్సీ ఆగస్టు 9న సీఎస్ఐఆర్ ఎన్ఈటీ కోసం ప్రొవిజనల్ కీని జారీ చేసింది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఆగస్టు 11 వరకు అనుమతించింది. జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష భారతీయ యూనివర్శిటీలు, కాలేజీల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి భారతీయ జాతీయుల అర్హతను నిర్ణయించనుంది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ పరీక్షను నిర్వహించే బాధ్యతను అప్పగించింది. ఈ పరీక్ష డిసెంబర్, జూన్‌లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఫార్మాట్‌లో జరుగుతుంది.

పరీక్షా విధానం :
పరీక్షలో ఐదు సబ్జెక్టులు ఉన్నాయి. కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్, అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, కోర్సు కోడ్‌లు, అర్హత ప్రమాణాలు, ప్రశ్నాపత్రం, ఫీజులు మరిన్నింటికి సంబంధించిన వివరణాత్మక సమాచారాన్ని పరీక్ష వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

Read Also : NEET UG 2024 Counselling : నీట్ యూజీ కౌన్సెలింగ్ రిజల్ట్స్ ఎప్పుడంటే? ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు..!

ట్రెండింగ్ వార్తలు