ముందు రాము, ఆ తర్వాత రెమో, ఇప్పుడేమో అపరిచితుడు..! పూటకో మాట మాట్లాడుతున్న సంజయ్ రాయ్

ఊసరవెల్లి రంగులు మార్చినంత ఈజీగా కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు నిందితుడు సంజయ్ రాయ్ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూ తన నటనా కౌశల్యంతో విచారణ అధికారులను, దేశ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాడు.

Kolkata Doctor Case : ముందు రాము, ఆ తర్వాత రెమో, ఇప్పుడేమో అపరిచితుడు.. ఒక్కో సిటుయేషన్ కు ఒక్కో క్యారెక్టర్.. వీడు యాక్టింగ్ లో కమలహాసన్.. నేరాలు చేసి తప్పించుకోవడంలో అపరిచితుడు. ముందేమో నేనే చేశా అన్నాడు. ఆ తర్వాత ఇరికించారని ఏడ్చాడు. ఇప్పుడేమో తానసలు అక్కడ లేనంటున్నాడు. ఊసరవెల్లి రంగులు మార్చినంత ఈజీగా కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు నిందితుడు సంజయ్ రాయ్ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూ తన నటనా కౌశల్యంతో విచారణ అధికారులను, దేశ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాడు.

గోప్యంగా లై డిటెక్టర్ టెస్టుల నివేదిక..
డాక్టర్ హత్యాచారం కేసులో కోర్టు అనుమతితో సీబీఐ అధికారులు నిందితులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. ప్రధాన నిందితుడు సంజయ్ రాజ్, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ లతో పాటు ఘటన జరిగిన రోజున డ్యూటీలో ఉన్న మరో నలుగురు డాక్టర్లు, సివిల్ వాలంటీర్ లకు లై డిటెక్టర్ టెస్టులు చేశారు. ఢిల్లీ నుంచి రప్పించిన సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుల బృందం ఈ లై డిటెక్టర్ టెస్టులు నిర్వహించింది. అయితే, లై డిటెక్టర్ నివేదికను సీబీఐ అధికారులు గోప్యంగా ఉంచారు.

లై డిటెక్టర్ టెస్టులో అన్నీ అబద్దాలే, పొంతన లేని సమాధానాలే..!
ఈ పాలిగ్రాఫ్ టెస్టులో నిందితుడు సంజయ్ రాయ్ ఏం చెప్పాడు అనే దానిపై అనేక వార్తలు వస్తున్నాయి. లై డిటెక్టర్ టెస్టులో నిందితుడు సంజయ్ రాయ్ అన్నీ తప్పుడు సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఒకదానికి మరొకటి పొంతన లేని సమాధానాలు చెప్పాడని తెలుస్తోంది. తాను ఆసుపత్రి సెమినార్ హాల్ లోకి వెళ్లేసరికి ఆ డాక్టర్ చనిపోయి కనిపించిందని సంజయ్ రాయ్ చెప్పినట్లు సమాచారం. ఇక ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ సమయంలో సంజయ్ రాయ్ అనాలోచితంగా, ఆత్రుతగా ఉన్నట్లు కనిపించిందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు అబద్దాలు, నమ్మశక్యం కాని సమాధానాలను చెప్పినట్లు తెలుస్తోంది.

Also Read : మచిలీపట్నంలో వెలుగులోకి వచ్చిన కామాంధుడి అకృత్యాలు.. పోలీసులకు మైనర్ బాలిక ఫిర్యాదు