Operation Ganga : యుక్రెయిన్ నుంచి మనోళ్లు మరింత మంది వచ్చేశారు

విడతల వారీగా ఢిల్లీ చేరుకుంటున్నారు ఏపీ, తెలంగాణ విద్యార్థులు. వీరికి ఏపీ, తెలంగాణ భవన్లో భోజన, వసతి సదుపాయాలు కల్పించారు.

యుక్రెయిన్ నుంచి భారత్ కు వస్తున్నారు తెలుగు విద్యార్థులు. మూడు ప్రత్యేక విమానాల్లో యుక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు ఏపీ, తెలంగాణకు చెందిన వందలాది మంది విద్యార్థులు. వీరికి ఏపీ, తెలంగాణ భవన్ లలో వసతి, భోజన ఏర్పాట్లు చేశారు. వచ్చిన కొద్దిగంటల్లోనే వారిని స్వస్థలాలకు పంపించేస్తున్నారు.

Read This : Operation Ganga : మా పాప పేరు ‘ఆపరేషన్ గంగ’

ఆదివారం మార్చి 6నాడు ఒక్కరోజులో 176 మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. ఏపీ నుంచి 71 మంది, తెలంగాణ నుంచి 105 మంది విద్యార్థులు వచ్చారు.

యుక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకుంటున్నారు తెలంగాణ విద్యార్థులు. ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటి వరకు 612 మంది తెలంగాణ విద్యార్థులు భారత్ కు చేరుకున్నారు. విడతల వారీగా ఢిల్లీ చేరుకుంటున్నారు తెలంగాణ విద్యార్థులు. వీరికి తెలంగాణ భవన్లో భోజన, వసతి సదుపాయాలు కల్పించారు.

తెలంగాణ విద్యార్థుల యోగ క్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని చెప్పారు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను యుక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు వివరించామన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు విమానాల్లో పంపిస్తున్నామని చెప్పారు.

Read This : Operation Ganga : కొనసాగుతున్న ఆపరేషన్ గంగ.. 50 విమానాల్లో చేరుకున్న 11వేల మంది భారతీయులు

యుక్రెయిన్ లోని యుద్ధ ప్రభావతి ఈస్టర్న్ స్టేట్స్ లో ఇంకా వేల మంది భారతీయులు చిక్కుకున్నారు. తమను రక్షించాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఐతే.. చిక్కుకున్న వారందరినీ స్వదేశం రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రం చెబుతోంది.

ట్రెండింగ్ వార్తలు