Adani Companies RBI : అదానీ సంస్థలకు ఇచ్చిన రుణాల వివరాలివ్వాలని.. వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు

అదానీ గ్రూప్ వ్యవహారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టి పెట్టింది. అదానీ సంస్థలకు ఇచ్చిన రుణాలపై వాణిజ్య బ్యాంకులు వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.

Adani Companies RBI : అదానీ గ్రూప్ వ్యవహారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టి పెట్టింది. అదానీ సంస్థలకు ఇచ్చిన రుణాలపై వాణిజ్య బ్యాంకులు వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ గ్రూప్ నిర్వహణ మూల ధనం, లోన్లలో 37శాతం బ్యాంకుల వాటా ఉంది. ద్రవ్య సంస్థల నుంచి 11 రుణాలు తీసుకుంది. ఇండియన్ గ్రూప్ నుంచి 12 నుంచి 13 శాతం వరకు రుణాలను సమకూర్చుకుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ అదానీ గ్రూప్ కు 7 వేల కోట్ల ఇచ్చింది. ఇంటర్ గ్రూప్ నుంచి 12 నుంచి 13 శాతం లోన్లు పొందింది. ఇక అదానీ స్టాక్స్ పతనంపై సెబీ కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. అదానీ గ్రూప్ కు ఇచ్చిన రుణాల వివరాలను వెంటనే తెలపాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ మేరక బ్యాంకులు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.

Adani Enterprises Key Decision : అదానీ గ్రూప్ కీలక నిర్ణయం.. ఎఫ్ పీవో ఆఫర్ రద్దు.. రూ.20వేల కోట్లు తిరిగి పెట్టుబడిదారులకు చెల్లింపు

స్టాక్ మార్కెట్ లో ఒడిదుకుల కారణంగానే ఎఫ్ పీవో ఉపసంహరించుకున్నట్లు గౌతమ్ అదానీ ప్రకటించారు. ఎఫ్ పీవో ఉపసంహరణపై అదానీ స్వయంగా వివరించారు. అదానీ ఎంటర్ ప్రైజెస్ 20 వేల కోట్ల మలి విడత పబ్లిక్ ఆఫర్ ను ఉపసంహరించుకోవడం వెనుక ఉన్న కారణాన్ని వివరించారు. అమెరికాకు చెందిన షార్ సెల్లర్ హిండెన్ బర్గ్ ఆరోపణలు తర్వాత అదానీ గ్రూప్ షేర్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇప్పటివరకు ఆయా కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 90 మిలియన్ డాలర్లకు పైగా ఆవిరైంది. పూర్తిగా సబ్ స్క్రబ్ అయినా ఎఫ్ పీవో తర్వాత నిన్నటి ఉపసంహరణ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్య పరిచిందని కానీ మార్కెట్ అస్థిరతను పరిగణనలోకి తీసుకుంటే ఎఫ్ పీవోతో కొనసాగడం నైతికంగా సరైనది కాదని బోర్డు గట్టిగా భావించిందని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు