Chennai: తమిళనాడులో ఆర్ఎస్ఎస్ మార్చ్ రద్దు.. కోర్టు తీర్పును సవాల్‭ చేయనున్న ఆర్ఎస్ఎస్

ర్యాలీ నిర్వహణ ప్రశాంతంగా కొనసాగాలని, ఒకవేళ ఏదైనా తేడా జరిగితే కోర్టు పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్ఎస్ఎస్‭ను మద్రాస్ హైకోర్టు హెచ్చరించింది. కశ్మీర్, పశ్చిమ బెంగాల్, కేరళ సహా ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీలను ఆర్ఎస్ఎస్ ప్రస్తావిస్తూ.. తమిళనాడులో ఇలా మైదానాల్లో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం సరికాదని భావిస్తోంది. ఈ విషయమై కోర్టులోనే సవాల్ చేయనున్నట్లు ఆర్ఎస్ఎస్ ఓ ప్రకటనలో పేర్కొంది.

Chennai: ఆదివారం తమిళనాడు వ్యాప్తంగా చేపట్టాలనుకున్న ర్యాలీని రద్దు చేసుకున్నట్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రకటించింది. ఈ ర్యాలీపై మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ.. ప్రత్యేక షరతులు విధించింది. దీంతో ఆర్ఎస్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రోడ్డుపై కాకుండా మైదానాలు, స్టేడియాల్లో ర్యాలీ నిర్వహించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అంతే కాకుండా 50 ప్రాంతాలకు బదులు 44 ప్రాంతాల్లో నిర్వహణకు అనుమతి ఇచ్చింది. దీనిపై ఆర్ఎస్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి ముందు 50 ప్రాంతాల్లో నిర్వహణకు స్టాలిన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ర్యాలీ నిర్వహణ ప్రశాంతంగా కొనసాగాలని, ఒకవేళ ఏదైనా తేడా జరిగితే కోర్టు పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్ఎస్ఎస్‭ను మద్రాస్ హైకోర్టు హెచ్చరించింది. కశ్మీర్, పశ్చిమ బెంగాల్, కేరళ సహా ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీలను ఆర్ఎస్ఎస్ ప్రస్తావిస్తూ.. తమిళనాడులో ఇలా మైదానాల్లో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం సరికాదని భావిస్తోంది. ఈ విషయమై కోర్టులోనే సవాల్ చేయనున్నట్లు ఆర్ఎస్ఎస్ ఓ ప్రకటనలో పేర్కొంది.

Whatsapp : అయ్యా మస్క్.. వాట్సాప్ కూడా కొనండయ్యా.. 10 డాలర్లు ఫీజు పెట్టండయ్యా.. గ్రూపుల గోల ఉండదు..!

ట్రెండింగ్ వార్తలు