Goa Curlie restaurant: కూల్చివేతకు సిద్ధంగా బుల్డోజర్, అధికారులు.. కోర్టు తీర్పుతో ఆగిన రెస్టారెంట్‌ కూల్చివేత

అక్రమంగా నిర్మించిన రెస్టారెంట్‍‌ను బు‌ల్డోజర్లతో కూల్చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు. కానీ, సుప్రీంకోర్టు దీనిపై అత్యవసర విచారణ జరిపి స్టే విధించింది. దీంతో చివరి నిమిషంలో కూల్చివేత ప్రక్రియ నిలిచిపోయింది.

Goa Curlie restaurant: అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కారణంగా మరికొద్దిసేపట్లో కూల్చివేసేందుకు సిద్ధమైన రెస్టారెంట్‌కు కోర్టు ఉత్తర్వు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చింది. బుల్డోజర్‌తో కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్న అధికారులు కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌తో వెనక్కు తగ్గారు.

iPhone 14: అమెరికా నుంచి ఐఫోన్లు తెప్పించుకుందామనుకుంటున్నారా.. అయితే ఆగిపోండి.. ఎందుకంటే

ఇటీవల బీజేపీ నేత సోనాలి ఫోగట్ హత్యతో వెలుగులోకొచ్చిన గోవా రెస్టారెంట్ కర్లీ. సోనాలి హత్యకు గురైన ఈ రెస్టారెంట్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. దీంతో గోవా అధికారులు ఈ రెస్టారెంట్‌కు సంబంధించిన అన్ని అంశాల్ని పరిశీలించగా, ఈ నిర్మాణం అక్రమమని తేలింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలడంతో నోటీసులు జారీ చేసిన గోవా అధికారులు కూల్చివేతకు సిద్ధమయ్యారు. అయితే, దీనిపై కర్లీ రెస్టారెంట్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కూల్చివేత నిలిపివేయాలని కోరింది.

Child Marriage: ఏడాది వయసులోనే వివాహం.. చిన్నారి పెళ్లిని 20 ఏళ్లకు రద్దు చేసిన కోర్టు

గురువారం నోటీసులు ఇచ్చి, శుక్రవారమే కూల్చివేస్తున్నారని రెస్టారెంటు యాజమాన్యం కోర్టు దృష్టికి తెచ్చింది. దీంతో సుప్రీంకోర్టు శుక్రవారం అత్యవసర విచారణ జరిపింది. కూల్చివేతపై స్టే విధించింది. అయితే, రెస్టారెంట్‌కు సంబంధించిన అన్ని రకాల కమర్షియల్ లైసెన్స్‌లు రద్దు చేయాలని సూచించింది. అలాగే బుధవారంలోగా ఈ అంశంలో తమ వైఖరేంటో చెప్పాలని ప్రభుత్వానికి సూచించింది.

 

ట్రెండింగ్ వార్తలు