PM Candidate Remark: ప్రధాని పదవి ఖాళీగా లేదు.. నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి రిప్లై

వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి మమతా బెనర్జీ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఆమెకు అంతటి సామర్థ్యం ఉంది. అయితే భారతదేశంలో విభజన రాజకీయాలను అంతం చేసే శక్తి మమతకు ఉందనే విషయాన్ని నేను చెప్పలేను. కానీ ఇప్పటి పరిస్థితుల్లో అయితే మమత ప్రధాని అభ్యర్థిగా సరిపోతారు

PM Candidate Remark: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిపై తన అభిప్రాయాన్ని వెల్లడించి, భారత రాజకీయాల్లో చర్చకు దారి తీశారు నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే ప్రధానమంత్రి అభ్యర్థిగా బాగుంటుందని అన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఘాటుగా స్పందించారు. ‘ప్రధానమంత్రి పదవి ఖాళీగా లేదు’ అంటూ అమర్త్యసేన్‭కు సమాధానం ఇచ్చారు.

Mayawati: వచ్చే ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్న మాయావతి

‘‘భారతదేశంలో ప్రధానమంత్రి పదవి ఖాళీ లేదు. గత రెండు దఫాలుగా భారత ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీపై విశ్వాసం ఉంచారు. 2024లో కూడా ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) మళ్లీ అధికారంలోకి వస్తుంది’’ అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి మమతా బెనర్జీ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఆమెకు అంతటి సామర్థ్యం ఉంది. అయితే భారతదేశంలో విభజన రాజకీయాలను అంతం చేసే శక్తి మమతకు ఉందనే విషయాన్ని నేను చెప్పలేను. కానీ ఇప్పటి పరిస్థితుల్లో అయితే మమత ప్రధాని అభ్యర్థిగా సరిపోతారు’’ అని అన్నారు. ‘‘దేశాన్ని కేవలం హిందూ దేశంగా, హిందీ మాట్లాడే దేశంగా బీజేపీ అర్థం చేసుకుంది. బీజేపీకి ప్రత్యామ్నాయం లేకుంటే చాలా ప్రమాదం’’ అని అమర్త్యసేన్ అన్నారు.

Maharashtra: బెదిరింపులతో కంచె దాటుతున్న రూ.వేల కోట్ల పట్టుబడులు.. ఆందోళన వ్యక్తం చేసిన ఫడ్నవీస్

ట్రెండింగ్ వార్తలు