Tomato Farmers Millionaires : టమాటాలు పండించి కోటీశ్వరులైన రైతులు..

టమాటాల ధరలు పెరిగటం వల్ల రైతన్నలకు మంచే జరిగింది. టమాటాలు పండించిన రైతులు కోటీశ్వరులవుతున్నారు. రైతన్న బాగుంటే పంట మరింతగా బాగుటుంది. టమాటాలు రైతన్నల మొహంలో చిరునవ్వులు పూయిస్తున్నాయి.

Tomato Farmers Millionaires : సాధారణంగా రైతులు ఎంత కష్టపడి పంట పడించినా వారికి పెద్దగా మిగిలేది ఏమీ ఉండదు. కానీ రైతులు కష్టపడి పండించిన పంట మార్కెట్ కు వెళ్లి వినియోగదారుడి చేతికి వెళ్లే క్రమంలో ధర మాత్రం అధికంగా ఉంటుంది. ఈ ప్రక్రియలో దళారులు బాగానే సంపాదిస్తారు. కానీ పంట పడించిన రైతుకు లబ్ది చేకూరదు. అలాగే వినియోగదారుడు డబ్బులు ఎక్కువ చెల్లించి కొంటాడు. మధ్యలో దళారులు మాత్రం బాగుపడుతుంటారు. ఇది సర్వసాధారణంగా జరుగేదే. కానీ తాజాగా టమాటాల ధరలు భారీగా పెరిగిపోవటంతో మహారాష్ట్రలో ఇద్దరు రైతులు కోటీశ్వరులయ్యారు. ఇదంతా టమాటాల చలవే..వ్యవసాయంతో కోట్లు సంపాదించిన రైతులు చాలా చాలా అరుదుగా కనిపిస్తుంటారు. కానీ.. దేశవ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలు..కేవల నెల రోజుల్లో ఇద్దరు రైతులను కోటీశ్వరుల్ని చేశాయి టామాటాలు.

మహారాష్ట్ర(Maharashtra)లోని పుణె జిల్లా(Pune district)లో తుకారాం భాగోజి గాయకర్‌ (Tukaram Bhagoji Gayakar)అనే రైతుకు 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాంట్లో 12 ఎకరాల్లో టమాటా పంట వేశారు. భార్యా భర్తలు ఇద్దరు కలిసి కష్టపడి పండించారు. పంట చేతికి వచ్చేసరికి ధరలు బాగా ఉన్నాయి. రోజు రోజుకు టమాటాల ధరలు పెరగటంతో విడతలవారీగా పంటను కోసం మార్కెట్ కు తరలించటంతో చక్కటి ధర వచ్చింది.దీంతో డబ్బులు బాగా చేతికి అందాయి. దీంతో సరైన జాగ్రత్తలు తీసుకుంటు పంటను వద్ధి చేశారు. నాణ్యమైన పండ్లు తయారయ్యాక పంట కోయటం మార్కెట్ కు తరలించటంతో దీనికి తోడు టమాటాల ధరలు రోజుకోరీతిగా పెరగటంతో కేవలం నెల రోజుల్లోనే రూ.కోటిన్నరకు పైగా ఆదాయం పొందారు.

ATM Center : వీళ్లేం దొంగల్రా బాబూ.. ఏటీఎంలోంచి డబ్బులు కాకుండా ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

అలా ఒక్కో పెట్టెను రూ.2,100 చొప్పున నారాయణ్‌గంజ్‌ మార్కెట్‌లో అమ్మగా శుక్రవారం (జులై 21,20123) ఒక్కరోజే సుమారు 900 పెట్టెలను అమ్మి రూ.18 లక్షలు సంపాదించారు. టమాట పండ్లు నాణ్యమైనవి ఉండటంతో ధర బాగా పలికింది. ఒక్కో బాక్కుకు రూ.1000 నుంచి రూ.2,400లకు అమ్ముడవ్వటంతో డబ్బులు బాగా వచ్చాయి. దీంతో వ్యాపారులు కూడా రైతులుగా మారి టమాటాలు సాగుచేయటంతో పడ్డారు.

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)ధమ్‌తరీ జిల్లా( Dhamthari District)లోని బీరన్‌ గ్రామానికి చెందిన అరుణ్‌ సాహూ ( Arun Sahu)150 ఎకరాల్లో టమాటా సాగు చేసి.. రోజుకు 600 నుంచి 700 పెట్టెలు విక్రయించి..కేవలం జులై నెల సగం రోజులకే రూ.కోటికి పైగా సంపాదించారు. ఉన్నత విద్య చదివిన సాహూ.. వ్యవసాయంపై మక్కువతో ఈ రంగంలోకి దిగారు. అలాగే కర్నాటకలోని కోలార్‌కు చెందిన ఓ రైతు కుటుంబం ఈ వారంలో 2,000 టమాట పెట్టెలను విక్రయించి రూ.38 లక్షలతో సంతోషంగా ఇంటికెళ్లింది.

Highest Living Elephent : 103 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏనుగు .. వత్సలను వరించనున్న గిన్నిస్‌ రికార్డు

అలా టమాటాలు కష్టపడి పండించిన రైతుల రుణం తీర్చుకున్నాయని చెప్పొచ్చు. సాధారణంగా వ్యవసాయం చేసే రైతులకు పెద్దగా మిగిలేదేమీ ఉండదు. అయినా నేలతల్లిని నమ్ముకున్న రైతు పంట పండిస్తునే ఉంటాడు. లాబమైనా నష్టమైనా..లాభం వచ్చినప్పుడు సంతోషపడే రైతు..నష్టం వచ్చినప్పుడు ఆవేదన చెందినా పంట పండిస్తునే ఉంటాడు. లాభనష్టాలతో ప్రమేయం లేకుండా..



ట్రెండింగ్ వార్తలు