Ring of Fire : నేడే ఆకాశంలో అద్భుతం.. ఉంగరం ఆకృతిలో కనువిందు చేయనున్న సూర్యుడు..!

ఈరోజు ఆకాశం ఓ అద్భుతం కనువిందు చేయనుంది. అదే ‘రింగ్స్ ఆఫ్ ఫైర్’ అంటే సూర్యుడు ‘ఉంగరం’ఆకారంలో కనిపిస్తాడు. అంటే సూర్య వలయం ఏర్పడి పగలే చీకట్లు కమ్ముతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

‘Ring Of Fire’ Solar Eclipse : ఈ ఖగోళ విశ్వంలో ఎన్నో అద్భుతాలు మరెన్నో వింతలు విశేషాలు నిత్యం ఉంటునే ఉంటాయి. కానీ కనిపించేవి మాత్రం కొన్ని మాత్రమే. అటువంటి అద్భుతాలను దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని వీక్షించి ఆస్వాదించాలని ఖగోళ శాస్త్రవేత్తలు సూచిస్తుంటారు. అటువంటి ఓ అద్భుతం ఈరోజు ఆకాశంలో కనువిందు చేయనుంది. అదే ‘రింగ్స్ ఆఫ్ ఫైర్’ అంటే సూర్యుడు ‘ఉంగరం’ఆకారంలో కనిపిస్తాడట. అంటే సూర్య వలయం ఏర్పడి పగలే చీకట్లు కమ్ముతాయని చెబుతున్నారు.

ఇదో విధమైన సూర్య గ్రహణం. అత్యంత అరుదుగా మాత్రమే ఇటువంటి సూర్యగ్రహణాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శనివారం అంటే అక్టోబర్ (2023) 14న ఏర్పడే అరుదైన ఈ సూర్యగ్రహణం సమయంలో అత్యంత అరుదుగా ఏర్పడే ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ (ఉంగరం ఆకృతిలో సూర్య వలయం) ఆకాశంలో ఆవిష్కృతం కాబోతోంది.

కానీ ఈ అరుదైన సూర్యగ్రహణం మాత్రం భారతీయులకు కనిపించదు. దీంతో భారతీయులు కాస్త నిరుత్సాహ పడాల్సిందే. ఈ రింగ్స్ ఆఫ్ ఫైర్ ఉత్తర అమెరికా, మెక్సికో సహా దక్షిణ, మధ్య అమెరికాలోని పలు దేశాల్లో మాత్రమే కనపడనుంది. ఈ దేశాల్లో ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ చివరిసారి 2012లో కనిపించింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడే ఆ అద్భుతం కనిపించి కనువిందు చేయనుంది.

Also Read: కేంబ్రియన్ పెట్రోల్ 2023 సైనిక విన్యాసాల్లో భారత సైన్యానికి బంగారు పతకం

కాగా ఈ గ్రహణం కనిపించే దేశాల్లో వాతావరణం అనుకూలిస్తే చూసే అవకాశం కలుగుతుంది. ఆ దేశాల్లో చలి ప్రభావం పెరుగుతుండటంతో ఈ సూర్యగ్రహం కనిపిస్తుందా..? కనిపించదా..? అనేది వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు తరువాత మళ్లీ 2046 వరకు ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ కనిపించదని సైంటిస్టులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు