Gold Rate : వెండి ధర దూకుడు.. బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ..

Gold And Silver Price Today : బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత రెండురోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన వెండి ధర.. ఇవాళ కూడా భారీగా పెరిగింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 500 పెరిగింది. దీంతో మూడు రోజుల్లోనే కిలో వెండిపై రూ.1500 పెరిగింది. బంగారం ధరలో ఇవాళ ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించినట్లయింది. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
    తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,350కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,380.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,500 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,530.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,350 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,380.
    చెన్నైలో బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 60 పెరిగింది. దీంతో అక్కడ 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,950 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,040కు చేరింది.

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా బుధవారం వెండి ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 96,000.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
    చెన్నైలో కిలో వెండి ధర రూ.96,000.
    కోల్ కతా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.91,500.
    బెంగళూరులో కిలో వెండి ధర రూ. 90,500 వద్ద కొనసాగుతుంది.

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు