SWP Investment : రిటైర్మెంట్ కు ముందే SWPలో ఇలా పెట్టుబడి పెట్టండి.. ఫింఛను పాలసీల కన్నా అధిక రాబడి..!
SWP Investment : రిటైర్మెంట్ కు రెండేళ్లకు ముందు ఏదైనా పాలసీ తీసుకుని దానిపై నెలవారీగా పింఛను తీసుకోవాచ్చా? ఇలాంటి పాలసీలు ఉంటాయా?

SWP Investment
SWP Investment : అందరూ సంపాదిస్తారు. కానీ, కొందరు మాత్రమే ఆ సంపాదనలో కొంత మొత్తాన్ని దాచుకుంటారు. అది పెట్టుబడుల రూపంలో కావొచ్చు.. మరి ఏదైనా సేవింగ్స్ (SWP Investment) రూపంలో కావొచ్చు. ప్రస్తుత రోజుల్లో చాలామంది సంపాదనతో పాటు పొదుపుపై కూడా ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ముఖ్యంగా రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం చూసేవారు తమ భవిష్యత్తులో ఆర్థికపరంగా ఎలాంటి లోటు లేకుండా జీవించాలని కోరుకుంటారు.
అందుకోసం ముందుగానే ఎంతోకొంత దాచుకోవాలని భావిస్తుంటారు. ఎందులో పెట్టబడి పెడితే బాగుంటుందో తెలుసుకోవాలని భావిస్తుంటారు. మీరు కూడా ఇలాంటి రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం చూస్తుంటే ముందుగా అసలు పెట్టుబడి పెట్టడం అవసరమా? లేదా ఏదైనా పాలసీలు తీసుకోవడం బెటరా? అనేది తప్పక అవగాహన కలిగి ఉండాలి.
ఉదాహరణకు.. మీరు మరో రెండేళ్లలో రిటైర్మెంట్ ప్లానింగ్ చేయబోతున్నారని అనుకుందాం.. ఇలాంటి సందర్భాల్లో ఏదైనా బీమా పాలసీని తీసుకోవచ్చు. కానీ, బీమా పాలసీలకు నెలకు రూ. 40వేల వరకు ప్రీమియం చెల్లించాలగలరా? అలా అయితే పర్వాలేదు. ఈ బీమా పాలసీ ద్వారా రెండేళ్లు ప్రీమియం చెల్లించాక దాని నుంచి కూడా ఫింఛను తీసుకోవాలని అనుకోవచ్చు.
Read Also : Tata Car Prices : పండగ చేస్కోండి.. టాటా కార్ల ధరలు తగ్గాయోచ్.. ఏ మోడల్ కారు ధర ఎంత తగ్గిందంటే?
పింఛను పాలసీల కన్నా బెటర్ ప్లాన్లు :
ఇలాంటి పాలసీలు మార్కెట్లో ఉంటాయి.. కానీ, ఈ పింఛను పాలసీలకన్నా చాలావరకూ అద్భుతమైన రాబడిని అందించే అనేక దీర్ఘకాలిక ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్లు ఉన్నాయి. మీరు పింఛను పాలసీలు తీసుకునే బదులుగా హైబ్రిడ్ ఈక్విటీ, బ్యాలెన్స్ డ్ అడ్వాంటేజ్ ఫండ్లలో క్రమానుగతంగా పెట్టుబడిని పెట్టవచ్చు. ఇలాంటి పెట్టబడి విధానాల్లో సేవింగ్ చేయడం ద్వారా భవిష్యత్తులో అద్భుతమైన రాబడిని పొందవచ్చు.
మీరు చేయాల్సిందిల్లా.. వీలైనంతకాలం ఎక్కువ రోజులు పెట్టుబడిని పెట్టడం కొనసాగిస్తుండాలి. కొన్నాళ్లకు మీరు SWP అనే విత్ డ్రాబుల్ ప్లానింగ్ ద్వారా మీరు జమ చేసిన మొత్తంలో కొంత నెలవారీగా తీసుకునేందుకుందుకు వీలుంటుంది. అది కూడా మీరు అప్పటివరకూ జమ చేసిన మొత్తంలో 8 శాతం చొప్పున వెనక్కి తీసుకునేలా ఏర్పాటు చేసుకోవడం మర్చిపోవద్దు. వాస్తవానికి ఈ పెట్టుబడి విధానం అనేది యూన్యూటీ పథకాలకన్నా కొంచెం మెరుగ్గానే ఉంటుందని గమనించాలి.
కాకపోతే ఇతర పాలసీల పెట్టుబడులతో పోలిస్తే కొంచెం మార్కెట్ పరంగా రిస్క్ ఉంటుందని గమనించాలి. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంపై నష్టం ఉండే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. ఈ రిస్క్ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుంటే మాత్రం కచ్చితంగా ఇలాంటి పెట్టుబడి విధానంలో కొనసాగవచ్చు. దీర్ఘకాలంలో అనేక ఆర్థికపరమైన ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.