Tata Car Prices : పండగ చేస్కోండి.. టాటా కార్ల ధరలు తగ్గాయోచ్.. ఏ మోడల్ కారు ధర ఎంత తగ్గిందంటే?

Tata Car Prices : టాటా మోటార్స్ కార్లు టాటా పంచ్ రూ.85 వేల వరకు, నెక్సాన్ రూ.1.55 లక్షల వరకు, ఆల్ట్రోజ్ రూ.1.11 లక్షల వరకు తగ్గనున్నాయి.

Tata Car Prices : పండగ చేస్కోండి.. టాటా కార్ల ధరలు తగ్గాయోచ్.. ఏ మోడల్ కారు ధర ఎంత తగ్గిందంటే?

Tata Car Prices

Updated On : September 6, 2025 / 12:42 PM IST

Tata Car Prices : కొత్త కారు కొంటున్నారా? టాటా మోటార్స్ కార్లు భారీగా తగ్గనున్నాయి. వాహనాలపై కేంద్రం GST రేటును తగ్గించిన తర్వాత టాటా మోటార్స్ తన కార్లపై భారీ డిస్కౌంట్లను (Tata Car Prices) అందించనుంది.  ఈ మేరకు టాటా కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అన్ని మోడళ్ల కార్ల ధరలు అమాంతం దిగిరానున్నాయి.

సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ కార్లు రూ. 65 వేల నుంచి రూ. 1.55 లక్షలకు చౌకగా మారనున్నాయి. టాటా కార్లలో ప్రధానంగా టియాగో, టిగోర్, పంచ్, ఆల్ట్రోజ్, నెక్సాన్, కర్వ్, సఫారీ, హారియర్ వంటి వివిధ విభాగాల వాహనాలపై ఎంతవరకు తగ్గింపు పొందనున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టాటా టియాగోపై రూ. 75వేల వరకు తగ్గింపు :
జీఎస్టీ రేట్ల తగ్గింపు తర్వాత టాటా మోటార్స్ ఎంట్రీ లెవల్ కారు టియాగో హ్యాచ్‌బ్యాక్ ధర రూ.75వేలు తగ్గనుంది. ప్రస్తుతం, టియాగో పెట్రోల్, సీఎన్‌జీతో పాటు ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఎక్స్-షోరూమ్ ధర రూ.5 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది.

Tata Car Prices : టాటా టిగోర్ పై రూ. 80వేల వరకు తగ్గింపు :

టాటా మోటార్స్ రెండో చౌకైన కారు టియాగో ధర సెప్టెంబర్ 22 నుంచి రూ. 80వేలు తగ్గనుంది. టాటా ఎంట్రీ లెవల్ సెడాన్ టియాగోలో పెట్రోల్, CNG అలాగే ఎలక్ట్రిక్ మోడల్స్ ఉన్నాయి. ఎక్స్-షోరూమ్ ధర రూ. 6 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

టాటా ఆల్ట్రోజ్ పై రూ. 1.10 లక్షల వరకు తగ్గింపు :
టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ ధర రూ.1,10,000 తగ్గింది. వినియోగదారులు సెప్టెంబర్ 22 నుంచి ఈ తగ్గింపు బెనిఫిట్ పొందవచ్చు. టాటా ఆల్ట్రోజ్ ప్రస్తుతం పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అలాగే, ఈ టాటా కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.6.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Read Also : Samsung Galaxy S24 FE : కొత్త ఫోన్ కావాలా? శాంసంగ్ గెలాక్సీ S24 FE ధర తగ్గిందోచ్.. అమెజాన్ లో జస్ట్ ఎంతంటే?

టాటా పంచ్ పై రూ. 85 వేల వరకు తగ్గింపు :
టాటా మోటార్స్ చౌకైన SUV పంచ్ ధర రూ. 85వేలు తగ్గింది. సెప్టెంబర్ 22 నుంచి వినియోగదారులు తగ్గింపు ధరకే ఈ కారును కొనుగోలు చేయొచ్చు. టాటా పంచ్ పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ మోడళ్లను కలిగి ఉంది. ఈ చిన్న SUV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6 లక్షల నుంచి అందుబాటులో ఉంటుంది.

టాటా నెక్సాన్‌ రూ. 1. 55 లక్షలు తగ్గింపు :
టాటా మోటార్స్ బెస్ట్ సెల్లింగ్ కారు నెక్సాన్ ధర రూ.1.55 లక్షలు తగ్గనుంది. టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ మోడళ్లను కలిగి ఉంది. ఈ సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.8 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

టాటా కర్వ్ ధర రూ. 65వేల వరకు తగ్గింపు :
టాటా మోటార్స్ SUV కూపే కర్వ్ ధర సెప్టెంబర్ 22 నుంచి రూ.65వేలు తగ్గనుంది. టాటా కర్వ్‌లో పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ మోడళ్లు ఉన్నాయి. ఈ కార్ల ఎక్స్-షోరూమ్ ధర రూ.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

టాటా సఫారీ ధర రూ.1.45 లక్షలు తగ్గింపు :
జీఎస్టీ రేట్ల తగ్గింపు తర్వాత టాటా మోటార్స్ అత్యంత శక్తివంతమైన SUV సఫారీ ధర రూ.1.45 లక్షలు తగ్గనుంది. సెప్టెంబర్ 22 నుంచి వినియోగదారులు తక్కువ ధరకు సఫారీని కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం, టాటా సఫారీ ఎక్స్-షోరూమ్ ధర రూ.15.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

టాటా హారియర్ పై రూ. 1.40 లక్షల వరకు తగ్గింపు :
టాటా మోటార్స్ పవర్ ఫుల్ SUV హారియర్ కస్టమర్లు GST రేట్ల తగ్గింపు తర్వాత రూ. 1.40 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ప్రస్తుతం, హారియర్ డీజిల్, ఎలక్ట్రిక్ మోడల్స్ అమ్ముడవుతున్నాయి. ఈ మిడ్ రేంజ్ SUV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15 లక్షలు ఉంటుంది.