Post Office : పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. నెలకు రూ. 11వేలు పెట్టుబడితో ఐదేళ్లలో ఎంత సంపాదించుకోవచ్చంటే?
Post Office RD Scheme : పోస్టాఫీసులో RD స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అద్భుతమైన రాబడిని పొందవచ్చు. ఎంత మొత్తంలో అంటే?

Government Schemes
Post Office RD Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? పోస్టాఫీసులో పెట్టుబడి చాలా సురక్షితం. అలాగే మంచి రాబడి కూడా పొందవచ్చు. పోస్టాఫీసు (Post Office RD Scheme) అందించే అద్భుతమైన పథకాల్లో నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ (RD) పథకం ఒకటి.
ఈ పథకంలో 5 ఏళ్ల వ్యవధితో అందించే చిన్న పొదుపు పథకం. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని జమ చేయడం ద్వారా భారీ మొత్తంలో రాబడి పొందవచ్చు. ఈ పథకంలో మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 6.7శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ పథకం ప్రయోజనాలు, పెట్టుబడికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం ఏంటి? :
పోస్టాఫీస్ RD అనేది సేవింగ్స్ స్కీమ్. ప్రతి నెలా స్థిర మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేనివారు క్రమం తప్పకుండా సేవింగ్ చేయాలని అనుకునే వారికి ఈ పథకం అద్భుతంగా ఉంటుంది. ఈ పథకం లాక్-ఇన్ వ్యవధి 60 నెలలు లేదా 5 ఏళ్లు. మీరు కేవలం రూ. 100తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. రూ. 10 గుణిజాలలో ఏదైనా మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు.
Post Office : 5 ఏళ్లలో రూ. 7 లక్షలు ఎలా? :
ఈ పథకంలో మీరు నెలకు రూ. 100తో పెట్టుబడి పెట్టండి. కానీ, మీరు ప్రతి నెలా రూ. 10వేలు పెట్టుబడి పెడితే కేవలం 5 ఏళ్లలో మీకు రూ. 7,13,659 భారీగా రాబడి పొందవచ్చు. మీ మొత్తం డిపాజిట్ మొత్తం రూ. 6 లక్షలు అవుతుంది. మీకు వడ్డీ రూపంలో రూ. 1,13,659 బెనిఫిట్ పొందవచ్చు.
ప్రస్తుత త్రైమాసికానికి (జూలై నుంచి సెప్టెంబర్ 2025 వరకు), ఈ పథకం 6.7శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షించిన తర్వాత ఈ రేటు మారవచ్చు. ఈ పథకం ప్రారంభంలో ఐదు సంవత్సరాలు. కానీ, మీరు కోరుకుంటే, మరో ఐదు ఏళ్లకు కూడా పొడిగించవచ్చు. మీరు మొత్తం 10 ఏళ్లు పెట్టుబడి పెట్టడం ద్వారా భారీగా రాబడిని పొందవచ్చు.
అత్యవసర పరిస్థితుల్లో రుణ సౌకర్యం :
ఈ పథకం మరో పెద్ద ప్రయోజనం ఏమిటంటే.. అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే డిపాజిట్ చేసిన డబ్బుపై రుణం తీసుకోవచ్చు. ఒక ఏడాది పూర్తయిన తర్వాత మీ మొత్తం డిపాజిట్ మొత్తంలో 50శాతం వరకు రుణం పొందవచ్చు. అయితే, ఈ రుణంపై వడ్డీ రేటు RD వడ్డీ రేటు కన్నా 2శాతం ఎక్కువ. క్రమం తప్పకుండా సేవింగ్ చేయాలనుకునేవారికి రిస్క్ లేని పెట్టుబడుల వైపు చూసేవారికి ఈ పోస్టాఫీసు పథకం అద్భుతంగా ఉంటుంది.