Aham Reboot : ‘అహం రీబూట్’ మూవీ రివ్యూ.. సుమంత్ ఒక్క పాత్రతోనే థ్రిల్లర్ సినిమా..

సుమంత్ హీరోగా ఒక్క పాత్రతోనే తెరకెక్కిన థ్రిల్లర్ సినిమా 'అహం రీబూట్'.

Aham Reboot Movie Review : సుమంత్ హీరోగా ఒక్క పాత్రతోనే తెరకెక్కిన థ్రిల్లర్ సినిమా ‘అహం రీబూట్’. సుమంత్ ఒక్క పాత్రతోనే వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రఘువీర్ గొరిపర్తి నిర్మాణంలో ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అనుకున్నా అనివార్య కారణాలతో ఇటీవలే ఆహా ఓటీటీలో డైరెక్ట్ గా విడుదల చేసారు.

కథ విషయానికొస్తే.. నిలయ్(సుమంత్) ఒక ఆర్జేగా పనిచేస్తూ ఉంటాడు. ఎప్పుడో అయిదేళ్ల క్రితం తన ర్యాష్ డ్రైవింగ్ వల్ల చనిపోయిన అమ్మాయిని గుర్తుచేసుకుంటూ, తన ఫుట్ బాల్ లైఫ్ పోయినందుకు, ఆ అమ్మాయి ఎవరో తెలియనందుకు అయిదేళ్లుగా బాధపడుతూ ఉంటాడు. ఓ రోజు ఆర్జేగా వర్క్ మొదలుపెట్టాక తన రేడియో స్టేషన్ కి ఒక కాల్ వస్తుంది. ఒక అమ్మాయి తనని ఎవరో కిడ్నాప్ చేసారంటూ, కాపాడమని కాల్ వస్తుంది. అయితే అది ముందు ప్రాంక్ కాల్ అనుకున్నా తర్వాత నిజమే అని తెలుస్తుంది. తాను మాట్లాడేది రేడియోలో అందరూ వింటూ ఉంటారు కాబట్టి డైరెక్ట్ గా చెప్పకుండా ఫోన్ లోనే ఆమె గురించి అన్ని వివరాలు తెలుసుకొని కాపాడాలి. పోలీసులు కూడా ఈ విషయంలో రంగప్రవేశం చేస్తారు. మరి ఆ అమ్మాయిని ఆర్జే నిలయ్ కాపాడాడా? పోలీసులు ఏం చేసారు? నిలయ్ వల్ల చనిపోయిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి కిడ్నాప్ అయిన అమ్మాయికి సంబంధం ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Vishwak Sen : ‘లైలా’గా మారిన విశ్వక్ సేన్.. ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. కొత్త సినిమా మొదలు..

సినిమా విశ్లేషణ.. ఈ సినిమా అంతా కేవలం ఒక్క పాత్రతోనే నడుస్తుంది. గతంలో కూడా ఇలా ఒక్క పాత్రతోనే సినిమా నడిపిస్తూ చాలా సినిమాలు వచ్చాయి. సుమంత్ ఒక్కడే తెరపై కనిపిస్తాడు. మిగతా పాత్రలన్నీ ఫోన్స్ లోనే మాటలతో వినిపిస్తాయి. కిడ్నాప్ అయిన అమ్మాయి రేడియో స్టేషన్ కి కాల్ చేస్తే ఎలా కాపాడారు అనే ఆసక్తికర కథ తీసుకున్నా కథనంలో మాత్రం అక్కడక్కడా బోర్ కొడుతుంది. ఒక్కడే పాత్ర కావడం, సినిమా అంతా మాటలతో నడవడం మాత్రమే కాక కొన్ని చోట్ల సీరియస్ సన్నివేశం అయినా అలాంటి థ్రిల్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. అయితే ఈ సినిమాకి అహం రీబూట్ అని ఎందుకు పేరు పెట్టారో డైరెక్టర్ కే తెలియాలి. రీ బూట్ అంటే మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అనే అర్థంలో హీరో పాత్రకు సరిపోయినా ముందు అహం ఎందుకు యాడ్ చేసారో.

ఇక ఈ సినిమాలో సుమంత్ ఒక్కడే నటుడు. చుట్టూ పాత్రలు లేకపోయినా రేడియోలో, ఫోన్స్ లో మాట్లాడుతూ, తనకి ఉన్న సమస్యతో బాధపడుతూ అన్ని ఎమోషన్స్ లోనూ బాగా నటించి మెప్పించాడు. సాంకేతికంగా.. ఈ సినిమా అంతా ఒకటే లొకేషన్ లో జరుగుతుంది. ఒక రేడియో స్టేషన్ అని ఒకటే రూమ్ లో షూట్ జరుగుతుంది. కెమెరా విజువల్స్ ఒక్క లొకేషన్ లోనే కొత్తగా అన్ని వైపులా నుంచి చూపించారు. సింగిల్ క్యారెక్టర్ తో కథ, కథనం బాగా రాసుకున్నారు. దర్శకుడిగా ప్రశాంత్ సాగర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. నిర్మాణ పరంగా కూడా చాలా తక్కువ బడ్జెట్ లోనే ఈ సినిమా తీసినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ఒకటే సింగిల్ క్యారెక్టర్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘అహం రీబూట్’ సినిమాని ఆసక్తికరంగా తెరకెక్కించారు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు