Ashwatthama : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో కూడా ‘అశ్వత్థామ’.. ‘హనుమాన్’ డైరెక్టర్ కామెంట్స్ వైరల్..

తాజాగా హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

Ashwatthama : హనుమాన్ సినిమాతో ఈ సంవత్సరం మొదట్లో భారీ హిట్ కొట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమంతుడి శక్తితో సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది, హనుమంతుడు తిరిగి వస్తే ఎలా ఉంటుంది అనే ఆసక్తికర కథతో హనుమాన్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా భారీ హిట్ అయి 350 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

అయితే హనుమాన్ సినిమాలో మన పురాణాల్లో చెప్పినట్టు ఏడుగురు చిరంజీవులలో హనుమంతుడు, విభీషణుడు పాత్రలని చూపించారు. అలాగే హనుమాన్ పార్ట్ 2 ప్రకటించడమే కాక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కూడా ప్రకటించారు. ఈ యూనివర్స్ తీసే సినిమాల్లో చిరంజీవులు వేద వ్యాసుడు, హనుమంతుడు, పరుశురాముడు, విభీషణుడు, అశ్వత్థామ, కృపాచార్య, బలి చక్రవర్తి పాత్రలు కూడా కనిపిస్తాయని టాక్ గతంలోనే వినిపించింది.

Also Read : Aham Reboot : ‘అహం రీబూట్’ మూవీ రివ్యూ.. సుమంత్ ఒక్క పాత్రతోనే థ్రిల్లర్ సినిమా..

తాజాగా హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇటీవల రిలీజయిన కల్కి సినిమాలో ఒక చిరంజీవి అయిన అశ్వత్థామ పాత్ర బాగా వైరల్ అయింది. నిజంగా అశ్వత్థామ ఉంటే ఇలాగే ఉంటారేమో అనేంతగా అమితాబ్ ని ఆ పాత్రలో చూపించారు. దీంతో ఓ నెటిజన్ మీ యూనివర్స్ లో అశ్వత్థామ పాత్ర, అతని కథ కూడా ఉంటుందా అని అడిగారు. దీనికి ప్రశాంత్ వర్మ సమాధానమిస్తూ.. ఇప్పుడు నేను చెప్పలేను కానీ మీరు ఊహించే అన్ని పాత్రలు ఉంటాయి అని తెలిపాడు. దీంతో ఇండైరెక్ట్ గా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అశ్వత్థామ పాత్ర కూడా ఉంటుందని హింట్ ఇచ్చాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోయే సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు