Delhi Budget2023: బీజేపీ నేతల్ని ఉద్దేశించి కేజ్రీవాల్ అంత మాటనేశారేంటి?

ఢిల్లీ ప్రభుత్వం (Delhi govt) ప్రవేశపెట్టబోయే బడ్జెట్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (VK Saxena) ఆమోదానికి పంపగా అక్కడే ఆగిపోయింది. ప్రకటనలపై చేసిన ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఖర్చు సహా ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం, అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు తక్కువగా ఉండడం వంటి అంశాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ (MHA) కోరింది

Delhi Budget2023: చదువురానివరనే విమర్శలు రాజకీయాల్లో సహజంగా వినిపిస్తుంటాయి. ఈ విమర్శలు భారతీయ జనతా పార్టీ (BJP) నేతల మీద చాలా ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఇవి నెటిజెన్లు, మామూలు ప్రజలు లేదంటే వివిధ రాజకీయ పార్టీల వారే అయినా అత్యంత కింది స్థాయి వారి నుంచి వినిపిస్తుంటాయి. కానీ, ఇవే మాటలు ఒక ముఖ్యమంత్రి నుంచి వస్తే..? వచ్చాయి. ఢిల్లీ బడ్జెట్(Delhi budget2023)‭ను ఆమోదించకుండా తాత్సారం చేసినందుకు గాను మంగళవారం అసెంబ్లీ(assembly)లో మాట్లాడుతూ బీజేపీ నేతల్ని చదువురానివరంటూ విమర్శలు గుప్పించారు. వీరు పార్టీలోని కార్యకర్త స్థాయి నుంచి హైకమాండ్ వరకూ విస్తరించి ఉన్నారంటూ తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు.

WSJ on BJP: ఏంటీ బీజేపీ అంతలా ఎదిగిపోయిందా? ప్రపంచంలో చాలా ముఖ్యమైన పార్టీ అని కితాబిచ్చేసిన అమెరికా పత్రిక

ఢిల్లీ ప్రభుత్వం (Delhi govt) ప్రవేశపెట్టబోయే బడ్జెట్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (VK Saxena) ఆమోదానికి పంపగా అక్కడే ఆగిపోయింది. ప్రకటనలపై చేసిన ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఖర్చు సహా ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం, అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు తక్కువగా ఉండడం వంటి అంశాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ (MHA) కోరింది. అయితే వీటికి సమాధానం ఇస్తూనే బడ్జెట్ ప్రతులను పంపినట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం చెబుతోంది. నాలుగు రోజుల హైడ్రామా అనంతరం ఎట్టకేలకు మంగళవారం కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది.

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్.. రూ.10 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్

కానీ, మంగళవారం ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ వాయిదా పడింది. ఈ విషయాన్ని సోమవారమే అసెంబ్లీలో ప్రకటించారు కేజ్రీవాల్. ఢిల్లీ ప్రజల మీద కోపాన్ని తగ్గించుకోవాలని, బడ్జెట్ ఆపొద్దంటూ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి (PM Modi) ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాశారు. ఇక సాయంత్రం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ‘‘గడుపులోపు బడ్జెట్ ఆమోదించకుండా తమ వద్ద పెట్టుకున్న సందర్భం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇలా జరగడం ఇదే మొదటిసారి. మౌలిక సదుపాయాలకు రూ.20,000 కోట్లు, ప్రకటనలకు రూ.500 కోట్లు కేటాయించామని చెప్పాం. అదేంటో.. వారికి రూ.20,000 కోట్ల కంటే రూ.500 కోట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి’’ అని కేజ్రీవాల్ అన్నారు.

Amritpal singh: అదిగదిగో అమృతపాల్ సింగ్, అరెర్రె ఎస్కేప్.. చిక్కినట్టే చిక్కి చెక్తేస్తున్న ఖలిస్తానీ లీడర్

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఆ పార్టీలో చుదువురానివారే ఎక్కువ. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అలాంటి వారు విస్తరించి ఉన్నారు. కాగా, కేజ్రీవాల్ ఈ మాట అనగానే సభలోని బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అరిచారు. అయితే ‘‘మీ నాయకుల పేరు ఎవరిదీ నేను ఎత్తలేదు’’ అంటూ మోదీ-షాల పేరును ప్రస్తావించకుండానే మరోసారి విమర్శలు గుప్పించారు.

ట్రెండింగ్ వార్తలు