TPCC : అభ్యర్థుల బలాబలాలపై సర్వేలు చేశాకే టికెట్ ఖరారు, అందరి అభిప్రాయాలతోనే ఎంపిక- మహేశ్ కుమార్ గౌడ్

గెలుపు కోసం వడపోత చాలా అవసరం. అంకిత భావం, లాయల్టీ కూడా పరిశీలిస్తున్నాం. TPCC

TPCC Election Committee

TPCC : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీపీసీసీ మరింత స్పీడ్ పెంచింది. పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ గాంధీభవన్ లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. ఎన్నికల్లో 119 స్థానాల కోసం 1025 దరఖాస్తులు వచ్చాయి. 35 నుంచి 40 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది.

ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం వివరాలను ఆ పార్టీ నేత మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. మూడున్నర గంటల పాటు ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం జరిగిందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సెప్టెంబర్ 2న మరోసారి సమావేశం కావాలని ప్రదేశ్ ఎన్నికల కమిటీ నిర్ణయించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు పెట్టుకున్న వారి లిస్ట్ ను కమిటీ సభ్యులకు ఇచ్చామన్నారు. పీఈసీలో అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించామన్నారు. అప్లయ్ చేసుకున్న నేతల నేపథ్యం, ఎన్ని ఏళ్లుగా పార్టీలో పని చేస్తున్నారు, ఏయే కార్యక్రమాలు చేశారు లాంటి అంశాలతో మరో రిపోర్ట్ ప్రిపేర్ చెయ్యాలని నిర్ణయించామన్నారు.

Also Read..Telangana Congress First List : తెలంగాణ కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్ట్‌ ఇదే..! 40మందితో జాబితా సిద్ధం..! 10టీవీ ఎక్స్‌క్లూజివ్‌ రిపోర్ట్‌

”సెప్టెంబర్ 2న మరోసారి పీఈసీ సమావేశం ఉంటుంది. సెప్టెంబర్ 4న స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉంటుంది. ఇవాళ చాలా విషయాలు చర్చించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ సీట్లపై డిస్కస్ చేశాము. బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. సీడబ్ల్యూసీ సమావేశం హైదరాబాద్ వేదికగా నిర్వహించాలని కోరనున్నాం. తొలి సమావేశం ఇక్కడ ఏర్పాటు చెయ్యాలని ఏఐసీసీకి లెటర్ రాయాలని తీర్మానం చేశాం.

అభ్యర్థుల బలాబలాలపై సర్వేలు ఉంటాయి. ఆ తర్వాతే నిర్ణయాలు ఉంటాయి. మొదటి జాబితా 30 నుంచి 40మందితో ఉంటుంది. ఫస్ట్ లిస్ట్ లో ఎస్సీ, ఎస్టీ స్థానాలతో పాటు సీనియర్ నేతల స్థానాలు ఉంటాయి. కొడంగల్, జగిత్యాల స్థానాలకు ఒక్కొక్క అప్లికేషన్ వచ్చింది. అత్యధికంగా ఇల్లందుకు 37 దరఖాస్తులు వచ్చాయి. సీనియర్ నేతలు ఉన్న చోట కూడా దరఖాస్తులొచ్చాయి. చాలా జిల్లాల్లో నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకొస్తున్నారు. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడానికి కమ్యూనిస్టులు ఆసక్తి చూపుతున్నారు.

Also Read..Telangana elections 2023: ఒంటరిగానే 119 స్థానాల్లో పోటీ.. అభ్యర్థుల జాబితా ప్రకటనపై వివరాలు తెలిపిన కిషన్ రెడ్డి

సంపత్ కుమార్ కామెంట్స్..
అందరి అభిప్రాయాలతోనే అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. గెలుపు కోసం వడపోత చాలా అవసరం. అంకిత భావం, లాయల్టీ కూడా పరిశీలిస్తున్నాం. జనాభా దామాషా ప్రకారమే సీట్లు. కిందిస్థాయి నేతల వరకు సంతృప్తి పొందేలా ఎంపిక. చివరి నిమిషంలో ఎంపిక అనేది ఉండదు.

ట్రెండింగ్ వార్తలు