Arjun Tendulkar: ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్‌తో అర్జున్ టెండూల్కర్ డిన్నర్

యూకేలో ఎంజాయ్ చేస్తున్న అర్జున్ టెండూల్కర్ ఫొటోను డానియెల్ వ్యాట్ పోస్టు చేశారు. రెస్టారెంట్ లో కూర్చొని ఫుడ్ తింటున్న ఫొటో షేర్ చేస్తూ.. ఇలా క్యాప్షన్ కూడా రాసింది.

Arjun Tendulkar: యూకేలో ఎంజాయ్ చేస్తున్న అర్జున్ టెండూల్కర్ ఫొటోను డానియెల్ వ్యాట్ పోస్టు చేశారు. రెస్టారెంట్ లో కూర్చొని ఫుడ్ తింటున్న ఫొటో షేర్ చేస్తూ.. ఇలా క్యాప్షన్ కూడా రాసింది. “నిన్న నా చిన్ననాటి సహచరుడ్ని కలవడం చాలా సంతోషంగా ఉంది” అంటూ పేర్కొంది. నిజానికి డ్యానియెల్ వ్యాట్ వయస్సు 31 సంవత్సరాలు కాగా, అర్జున్ వయస్సు 22ఏళ్లు.

అర్జున్ టెండూల్కర్ రీసెంట్ గా ముగిసిన ఐపీఎల్ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అతని కెరీర్ లో రెండు టీ20లు మాత్రమే ఆడిన అర్జున్ రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. జనవరిలో ముంబై తరపున డొమెస్టిక్ టీ20 క్రికెట్ లో ఆడిన అర్జున్.. హర్యానా, పుదుచ్చేరీ జట్లపై ఆడాడు.

చివరి సీజన్ లో దారుణ వైఫల్యాలు రుచి చూసిన ముంబై ఇండియన్స్… నెక్స్ట్ ఎడిషన్ కోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టేసింది. తమ అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌ల కోసం జూలైలో ఇంగ్లాండ్‌లో మూడు వారాల ఎక్స్‌పోజర్ టూర్‌తో తదుపరి ఎడిషన్ కోసం సన్నాహాలను ప్రారంభించడానికి సిద్ధమైంది.

Read Also: మళ్లీ ముంబైకే టెండూల్కర్.. కాకపోతే,

వివిధ లేటెస్ట్ ఫెసిలిటీస్ తో ట్రైనింగ్ అందించడమే కాకుండా, MI భారతీయ యువకులు బహుళ కౌంటీలలో అగ్రశ్రేణి క్లబ్ జట్లతో కనీసం 10 T20 ఆటలను ఆడతారు. యుకె పర్యటనకు వెళ్లే ఆటగాళ్లలో — ఎన్‌టి తిలక్ వర్మ , కుమార్ కార్తికేయ , హృతిక్ షోకీన్ , మయాంక్ మార్కండే , రాహుల్ బుద్ధి , రమణదీప్ సింగ్ , అన్మోల్‌ప్రీత్ సింగ్ , బాసిల్ థంపి , మురుగన్ అశ్విన్ , ఆర్యన్ జుయల్, ఆకాష్ మేద్వాల్ , ఖాన్ , అర్జున్ టెండూల్కర్, డెవాల్డ్ బ్రెవిస్ (ఓవర్సీస్)ల పేర్లు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు