Harbhajan Singh : చాహల్ కు చోటు లేదా.. హర్భజన్ సింగ్ ఆశ్చర్యం

Harbhajan Singh surprised by exclusion of Yuzvendra Chahal ODI World Cup squad

Harbhajan Singh – Chahal : వన్డే ప్రపంచకప్ జట్టులో స్పిన్నర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal) కు చోటు కల్పించకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. త్వరలో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మెగా టోర్నమెంట్ కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) మంగళవారం ప్రకటించారు.

వరల్డ్ కప్ టీమ్ లోకి చాహల్ ను తీసుకోకపోవడం పట్ల హర్భజన్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ప్యూర్ మ్యాచ్ విన్నర్ అయిన చహల్.. ప్రపంచకప్ జట్టులో లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని ట్విటర్ లో పేర్కొన్నాడు. ఆల్ రౌండర్లు అక్షర పటేల్, రవీంద్ర జడేజాకు జట్టులో స్థానం సంపాదించారు. వీరితో పాటు శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ కూడా చోటు దక్కించుకున్నారు.

అందుకే ఆల్ రౌండర్లను తీసుకున్నాం
బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో జట్టును బ్యాలెన్స్ చేసేందుకే ఆల్ రౌండర్లవైపు మొగ్గు చూపినట్టు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. జట్టులో 8, 9 స్థానాలు కీలకమని.. టెయిలెండర్లు కూడా పరుగులు జత చేయాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఒక్కోసారి ఈ పరుగులే గెలుపోటములను నిర్ణయిస్తాయని, అందుకే ఆల్ రౌండర్లను తీసుకున్నామని వివరించాడు. ఠాకూర్, అక్సర్ వంటి ఆటగాళ్లు కొన్ని సమయాల్లో నిర్ణయాత్మక ఇన్నింగ్స్ ఆడతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

Also Read: వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు కెప్టెన్‌గా త‌న పేరు ప్ర‌క‌టించ‌గానే.. రోహిత్ శ‌ర్మ రియాక్ష‌న్ చూశారా..?

బ్యాటర్లు కూడా బౌలింగ్ చేయాలి..
రోహిత్ శర్మ వ్యాఖ్యలపై ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే ట్విటర్ లో వ్యంగ్యంగా స్పందించాడు. పరుగుల కోసం బౌలర్లపై ఆధారపడటం సరికాదన్న అర్థంలో ట్వీట్ చేశాడు. ఏడుగురు బ్యాటర్లు పరుగులు చేయలేనప్పుడు.. 8, 9 స్థానాల్లో వచ్చిన వారు బ్యాటింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించాడు. ఇక నుంచి బ్యాటర్లు కూడా బౌలింగ్ చేయాల్సివుంటుందని, అలాగే బౌలర్లు కూడా బ్యాటింగ్ స్కిల్స్ ఇంప్రూల్ చేసుకోవాల్సి ఉంటుందని సలహాయిచ్చాడు.

Also Read: ఆల్ రౌండర్లతో నిండిపోయిన ఆసీస్.. ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన..

ట్రెండింగ్ వార్తలు