Global Chess League: చెస్ క్రీడా ప్ర‌పంచంలో ఉన్న అంత‌రాల‌ను తొల‌గించేందుకు.. గ్లోబ‌ల్ చెస్ లీగ్ వ‌చ్చేస్తుంది

క్రికెట్, క‌బ‌డ్డీ వంటి ఆట‌లు ఐపీఎల్‌, ప్రొక‌బ‌డ్డీ కార‌ణంగా ఎంతో మందికి ద‌గ్గ‌ర అయ్యాయి. ఈ క్ర‌మంలోనే చెస్ గేమ్ పై అభిమానుల దృష్టి మ‌ర‌ల్చేందుకు మొద‌టిసారి చెస్ లీగ్ టోర్న‌మెంట్‌కు రంగం సిద్ద‌మైంది.

Koneru Humpy- Global Chess League: క్రికెట్, క‌బ‌డ్డీ వంటి ఆట‌లు ఐపీఎల్‌, ప్రొక‌బ‌డ్డీ కార‌ణంగా ఎంతో మందికి ద‌గ్గ‌ర అయ్యాయి. ఈ క్ర‌మంలోనే చెస్ గేమ్ పై ఎక్కువ మంది దృష్టి ప‌డేందుకు మొద‌టిసారి చెస్ లీగ్ టోర్న‌మెంట్‌ను నిర్వ‌హిస్తున్నారు. గ్లోబల్ చెస్ లీగ్( Global Chess League) మొదటి ఎడిషన్ 2023 జూన్ 21 నుంచి జూలై 2 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. టెక్ మహీంద్రా, ఫైడ్ జాయింట్ వెంచర్ అయిన జీసీఎల్ రాపిడ్ చెస్ ఫార్మాట్‌లో డబుల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో ఆరు జ‌ట్లు పాల్గొనుండ‌గా ప్రతి జ‌ట్టు కనీసం 10 మ్యాచ్‌లలో పోటీపడనున్నాయి. ఈ టోర్న‌మెంట్‌లో పోటీప‌డే అగ్ర‌శేణి క్రీడాకారుల్లో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి(Koneru Humpy) ఒక‌రు.

టెక్ మ‌హీంద్రా గ్లోబ‌ల్ చెస్ లీగ్ పేరిట నిర్వ‌హిస్తున్న ఈ టోర్నీకి సంబంధించిన అభిప్రాయాల‌ను హంపి పంచుకున్నారు. చెస్ క్రీడా ప్ర‌పంచంలో ప్ర‌స్తుతం ఉన్న అంత‌రాల‌ను తొల‌గించేందుకు ఇది ఎంతో ఉప‌యోగ ప‌డుతుంద‌న్నారు. పురుషులు, మహిళలు, జూనియర్ ఆటగాళ్లతో కూడిన మిశ్రమ జట్లతో లీగ్‌ ఉండటం చాలా ఆసక్తికరంగా ఉందని, టెక్ మహీంద్రా వంటి కార్పొరేట్ సంస్థ ఈ లీగ్ వెనుక ఉండ‌డం ఖచ్చితంగా పెద్ద ప్ర‌భావాన్ని చూపుతుంద‌న్నారు. ఈ లీగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్వాహకులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.

IPL2023 Final : మ్యాచ్ వాయిదా.. అభిమానుల అగ‌చాట్లు.. ధోనిని చూసేందుకు రైల్వే స్టేష‌న్‌లోనే ప‌డుకున్న చెన్నై ఫ్యాన్స్‌

ప్ర‌స్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రీడల్లో మహిళల సంఖ్య పెరుగుదల నేపథ్యంలో, మాతృత్వం పొందిన తర్వాత కూడా మహిళా అథ్లెట్లు తమ క్రీడను కొనసాగించేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని హంపి అభిప్రాయ పడ్డారు. తాను రెండింటినీ నిర్వహించగలిగినందుకు గర్వపడుతున్నాను అని అన్నారు. అదే స‌మ‌యంలో చెస్ క్రీడ‌లో మ‌హిళా క్రీడాకారిణుల సంఖ్య పెర‌గాల‌ని ఆకాంక్షించారు. పురుషుల సర్క్యూట్‌లో చాలా మంది యువకులు ఉన్నారు, కానీ మహిళల చెస్‌లో చాలా తక్కువ మంది ఉన్నారు. మన వద్ద ఉన్న జనాభా, ప్రతిభతో పోలిస్తే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దాన్ని మెరుగుప‌ర‌చాల‌ని హంపి అన్నారు.

1987 మార్చి 31న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా గుడివాడలో జన్మించింది హంపి. ఆరేళ్ల వ‌య‌స్సులో కెరీర్ ప్రారంభించింది. త‌న తండ్రి అశోక్ శిక్ష‌ణ‌లో రాటుదేలింది. 1997లో అండర్-10 విభాగంలో తన మొదటి పతకాన్ని గెలుచుకొని, జాతీయ చెస్ ఛాంపియన్‌గా నిలిచింది. 2002లో 15 ఏళ్ల వయసులో గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను సా ధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అప్పటి వరకూ ఆ టైటిల్ సాధించిన వారిలో అతి పిన్న వయస్సు గల ప్లేయర్ గా నిలిచింది. ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత అయిన హంపి 2020లో ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన హంపి ప్ర‌స్త‌తుం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 204 స్థానంలో కొన‌సాగుతున్నారు.

IPL2023: ఐపీఎల్ విజేత‌కు ఎన్నికోట్లంటే..? ఆరెంజ్, ప‌ర్పుల్ క్యాప్ ఆట‌గాళ్ల‌కి ఎంతిస్తారంటే..?

ట్రెండింగ్ వార్తలు