Jasprit Bumrah To Open With Rohit Sharma Pacer’s Batting Clip During MI Nets Goes VIRAL
Bumrah : ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచులు ఆడిన ఆ జట్టు కేవలం మూడు మ్యాచుల్లోనే విజయం సాధించింది. 6 పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఆ జట్టు మిగిలిన మ్యాచుల్లో తప్పక గెలవాల్సి ఉంది. ఈ క్రమంలో ఓ సరికొత్త ప్రయోగానికి ముంబై జట్టు సిద్దమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రాను ఓపెనర్‌గా పంపించాలని భావిస్తోందట. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు ముంబై జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా చాలా సమయం బుమ్రా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. భారీ షాట్లు ఆడాడు.
స్వీప్, రివర్స్ స్వీప్, కవర్ డ్రైవ్, లాప్టెడ్ వంటి షాట్లను ప్రాక్టీస్ చేశాడు. కాగా.. బుమ్రా బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోను ముంబై సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. అయితే.. అతడు ఓపెనర్‌గా వస్తాడా? అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు.
ఈ సీజన్‌లో 8 మ్యాచులు ఆడిన బుమ్రా 32 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 204 పరుగులు ఇచ్చి 13 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ ప్రదర్శన 5/21. కాగా.. ఈ సీజన్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. బ్యాటింగ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. 100 స్ట్రైక్‌రేటుతో 11 పరుగులు చేశాడు.
PAK vs NZ : కివీస్ చేతిలో పాక్ ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన చిన్నారి..
కోల్‌కతా స్పిన్నర్ సునీల్ నరైన్ ఓపెనర్‌గా సక్సెస్ అయ్యాడని, ఆ విధంగానే బుమ్రా సైతం ఓపెనర్‌గా రాణిస్తాడు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ చరిత్రలో ముంబై, ఢిల్లీ జట్లు 34 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై 19 మ్యాచులను గెలిచింది.
Aaj batting tera Jassi bhai karega! ??#MumbaiMeriJaan #MumbaiIndians | @Jaspritbumrah93 pic.twitter.com/RO0WWHh7Fz
— Mumbai Indians (@mipaltan) April 26, 2024