Sunil Gavaskar : కోహ్లి స్ట్రైక్‌రేట్‌పై మండిప‌డ్డ గావస్కర్‌.. ఇలాగేనా ఆడేది?

విరాట్ కోహ్లి 51 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అయిన‌ప్ప‌టికీ అత‌డి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Sunil Gavaskar – Virat Kohli : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది. స‌న్‌రైజ‌ర్స్ హైదారాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 35 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి 51 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అయిన‌ప్ప‌టికీ అత‌డి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లి ఈ మ్యాచ్‌లో 43 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 51 ప‌రుగులు చేశాడు.

ఆరంభంలో బాగానే బౌండ‌రీలు కొట్టిన కోహ్లి ఆ త‌రువాత నెమ్మ‌దిగా ఆడాడు. దీంతో అత‌డి స్ట్రైక్‌రేటు దారుణంగా ప‌డిపోయింది. మ్యాచ్లో అత‌డి స్ట్రైక్‌రేటు 118గా న‌మోదైంది. కాగా.. విరాట్ కోహ్లి ఆట‌తీరుపై దిగ్గ‌జ ఆట‌గాడు సునీల్ గ‌వాస్క‌ర్ స్పందించాడు. త‌న స్థాయికి త‌గ్గ‌ట్లు ఆడ‌డంలో కోహ్లి విఫ‌లం అవుతున్నాడ‌ని మండిప‌డ్డాడు. కోహ్లి చేసిన అర్ధ‌శ‌త‌కం విలువైన‌దే అయినప్ప‌టికీ కూడా అత‌డి ఇన్నింగ్స్‌లో చాలా సేపు బౌండ‌రీలు లేకుండానే సాగింద‌న్నాడు.

RCB Fans : ఒక్క మ్యాచ్ గెల‌వగానే.. ఐపీఎల్ ఫైన‌ల్ తేదీ మార్చాల‌ని ఆర్‌సీబీ ఫ్యాన్స్ ప‌ట్టు.. కార‌ణం తెలిస్తే షాకే?

ఆరంభంలోనే బాగానే ఆడినా మ‌ధ్య‌లో ల‌య త‌ప్పిన‌ట్లుగా క‌నిపించిన‌ట్లు చెప్పుకొచ్చాడు. ఖ‌చ్చితంగా చెప్ప‌లేక‌పోతున్నా గానీ 31 లేదా 32 వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద నుంచి అనుకుంటా జ‌న‌దేవ్ ఉనాద్క‌త్ బౌలింగ్‌లో ఔట్ అయ్యే వ‌ర‌కు అత‌డు బౌండ‌రీనే కొట్ట‌లేదు. ఇన్నింగ్స్ మొద‌టి బంతి నుంచి ఆడుతూ 15వ ఓవ‌ర్‌లో ఔట్ అయ్యాడు. అత‌డి స్ట్రైక్ రేటు 118. అయితే.. ఇలాంటి స్టార్ ఆట‌గాడి నుంచి జ‌ట్టు ఇలాంటిది కోరుకుంటుంద‌ని తాను అనుకోవ‌డం లేద‌న్నాడు.

కాగా.. ఈ సీజ‌న్‌లో విరాట్ కోహ్లి ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ఇప్పటి వ‌ర‌కు 9 ఇన్నింగ్స్‌ల్లో 145 స్ట్రైక్‌రేటుతో 430 ప‌రుగులు చేసి టాప్ స్కోర‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ అత‌డి వ‌ద్దే ఉంది. కాగా.. కొన్ని మ్యాచుల్లో మ‌రీ నిదానంగా ఆడతాడ‌నే విమ‌ర్శ‌లు కోహ్లి పై ఉన్నాయి.

Virat Kohli : స‌న్‌రైజ‌ర్స్ పై గెలిచిన త‌రువాత విరాట్ కోహ్లి రియాక్ష‌న్స్ చూశారా?

ట్రెండింగ్ వార్తలు