Virat Kohli : సన్‌రైజర్స్ పై గెలిచిన తరువాత విరాట్ కోహ్లి రియాక్షన్స్ చూశారా?
ఎన్నాళ్లుగానో ఊరించిన విజయం సొంతం కావడంతో ఆటగాళ్లు కాస్త ఎమోషనల్ అయినట్లుగా కనిపించింది.

Virat Kohli can't stop laughing after win SRH
Virat Kohli laughing : ఐపీఎల్ 17వ సీజన్‌లో ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని నమోదు చేసింది. వరుసగా ఆరు మ్యాచులు ఓడిపోయిన ఆర్‌సీబీ గురువారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఆర్‌సీబీ అభిమానులతో పాటు ప్లేయర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నాళ్లుగానో ఊరించిన విజయం సొంతం కావడంతో ఆటగాళ్లు కాస్త ఎమోషనల్ అయినట్లుగా కనిపించింది.
ముఖ్యంగా పరుగుల యంత్రం, రికార్డుల రారాజు, బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అయితే కాసేపు చిన్న పిల్లాడిలా మారిపోయాడు. హైదరాబాద్ బ్యాటర్ల వికెట్ పడిన ప్రతిసారీ సంబురాలు చేస్తున్న అతడు జట్టు విజయం సాధించిన అనంతరం పట్టరాని సంతోషంలో తేలిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాన్నాళ్ల తరువాత కోహ్లి మనస్పూర్తిగా నవ్వడం చూస్తున్నాం అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Faf du Plessis : హైదరాబాద్ పై విజయం.. కోహ్లిపై కెప్టెన్ డుప్లెసిస్ వ్యాఖ్యలు వైరల్
The face Smiled when the little Kohli “Akaay” was born .
After that we See now ♥️♥️#ViratKohli? pic.twitter.com/KwnhMj73Lz
— ????? (@Itz_Surya18) April 25, 2024
ఇక ఈ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానం ఉప్పల్‌లో జరిగినప్పటికీ ఆర్‌సీబీ సైతం పెద్ద ఎత్తున మద్దతు లభించింది. దీంతో మ్యాచ్ అనంతరం మైదానంలోని ప్రేక్షకులకు కోహ్లి చేతులు జోడిస్తూ కృతజ్ఞతలు తెలిపాడు.
IPL Tickets : ఐపీఎల్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు..
His smile ❤️?#ViratKohli? pic.twitter.com/khlDvROFIb
— ???????♡︎ . (@viratkohligf) April 25, 2024
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విరాట్ కోహ్లి (43 బంతుల్లో 51), రజత్ పాటిదార్ (20 బంతుల్లో 50) లు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులకే పరిమితమైంది.
Virat Kohli : ఐపీఎల్ చరిత్రలోనే కోహ్లి ఒకే ఒక్కడు.. 10 సార్లు 400కి పైగా పరుగులు..