Hyderabad T20 Match: శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు.. భారీగా తరలివెళ్లిన ఫ్యాన్స్

భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు హైదరాబాద్ శివారులోని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. వారిని చూసేందుకు అక్కడకు భారీగా తరలివెళ్లారు ఫ్యాన్స్. విమానాశ్రయం నుంచి క్రికెటర్లు హైదరాబాద్ లోని హోటళ్లకు ప్రత్యేక బస్సుల్లో బయలు దేరారు. హోటల్ తాజ్ కృష్ణలో ఆస్ట్రేలియా ఆటగాళ్ల బస చేశారు. అలాగే, హోటల్ పార్క్ హయత్ లో భారత ఆటగాళ్ల ఉంటారు. రేపు ఉప్పల్ లో జరగనున్న మ్యాచ్ టికెట్ల కోసం ఇంతకు ముందు ఎన్నడూ లేనంత డిమాండ్ నెలకొంది.

Hyderabad T20 Match: భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు హైదరాబాద్ శివారులోని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. వారిని చూసేందుకు అక్కడకు భారీగా తరలివెళ్లారు ఫ్యాన్స్. విమానాశ్రయం నుంచి క్రికెటర్లు హైదరాబాద్ లోని హోటళ్లకు ప్రత్యేక బస్సుల్లో బయలు దేరారు. హోటల్ తాజ్ కృష్ణలో ఆస్ట్రేలియా ఆటగాళ్ల బస చేస్తారు. అలాగే, హోటల్ పార్క్ హయత్ లో భారత ఆటగాళ్ల ఉంటారు. రేపు ఉప్పల్ లో జరగనున్న మ్యాచ్ టికెట్ల కోసం ఇంతకు ముందు ఎన్నడూ లేనంత డిమాండ్ నెలకొంది.

హైదరాబాద్ అంతా క్రికెట్ మ్యాచ్ సందడి నెలకొంది. ఉప్పల్​ స్టేడియంలో రేపు జరగనున్న భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్​ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయి. రేపు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచుల సిరీస్ లో భారత్, ఆస్ట్రేలియా 1-1తో సమ ఉజ్జీలుగా ఉన్నాయి.

రేపటి మ్యాచ్ గెలిచే జట్టు సిరీస్ గెలుచుకుంటుంది. ఆసియా కప్ లో ఘోరంగా విఫలమైన టీమిండియా సొంత దేశంలో జరుగుతున్న ప్రస్తుత సిరీస్ లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. వచ్చే నెల నుంచి టీ20 ప్రపంచ కప్ జరగనుండడంతో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచులను ఇరు జట్లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.

Hyderabad T20 Match: 4 వేల కార్లు, 5 వేల బైకుల పార్కింగుకు స్థలం కేటాయింపు.. ట్రాఫిక్ ఆంక్షలు

ట్రెండింగ్ వార్తలు