Virat Kohli : పాకిస్తాన్ పై రికార్డు బ్రేక్ ఇన్నింగ్స్.. విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ వైరల్..!

ఆసియా కప్ 2023లో సూపర్-4 దశలో సోమవారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది.

Virat Kohli cuts cake enjoys in pool

Virat Kohli : ఆసియా కప్ 2023లో సూపర్-4 దశలో సోమవారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ(122 నాటౌట్), కేఎల్ రాహుల్ (111 నాటౌట్) శతకాలతో చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం కుల్దీప్ యాదవ్ చెలరేగడంతో పాకిస్తాన్ 128 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 228 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

IND VS PAK : కుల్దీప్ మాయ‌.. పాకిస్తాన్ పై 228 ప‌రుగుల భారీ తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం

భారత విజయంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో పలు రికార్డును అతడు సాధించాడు. వన్డేల్లో 13,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. 267 ఇన్నింగ్స్ ల్లోనే అతడు ఈ ఘనతను అందుకున్నాడు. కాగా.. వన్డేల్లో 13వేల పరుగులను అత్యంత వేగంగా చేసిన మొదటి ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.

సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను 321 ఇన్నింగ్స్ ల్లో అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. వన్డేల్లో విరాట్ కోహ్లికి ఇది 47వ శతకం కావడం గమనార్హం. వన్డేల్లో సచిన్ 49 శతకాలతో అందరికి కంటే ముందు ఉండగా అతడికి సమీపంలోకి విరాట్ వచ్చాడు.

Virat Kohli : చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. క్రికెట్ దేవుడి రికార్డు బ్రేక్‌..

పాకిస్తాన్ పై ఘన విజయం సాధించిన అనంతరం హోటల్ కు వెళ్లిన టీమ్ ఇండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. సిబ్బంది చాక్లెట్ కేకును ఏర్పాటు చేయగా, కట్ చేసిన విరాట్ కోహ్లీ తానే మొదటి పీస్ ను తిన్నాడు. ఆ తరువాత ఆటగాళ్లు స్విమ్మింగ్ పూల్లో సేదతీరారు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు