IND vs SL : శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్.. సంజూ శాంసన్‌కు నో ప్లేస్..!
శ్రీలంకతో టీ20 మ్యాచ్‌లో భారత్ ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగనుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 28, 2024 / 03:28 PM IST
IND vs SL 1st T20 India Predicted XI No Place For Sanju Samson In Team
IND vs SL 1st T20 : భారత క్రికెట్‌లో కొత్త శకం ప్రారంభం కానుంది. శనివారం శ్రీలంకతో జరిగే తొలి టీ20 మ్యాచ్‌తో హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్, కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్‌ల ప్రయాణం మొదలు కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ 2026 కోసం యువ ఆటగాళ్లతో జట్టును నిర్మించాల్సిన బాధ్యత కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్య పై ఉంది. ఈ నేపథ్యంలో లంకతో టీ20 మ్యాచ్‌లో ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగనుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ లు రావడం దాదాపుగా ఖాయం. ఇక మూడులో సూర్యకుమార్ యాదవ్, నాలుగో రిషబ్ పంత్ ఆడనున్నారు. మ్యాచ్‌ను బట్టి వీరిద్దరూ తమ తమ స్థానాలను మార్చుకునే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్ల జాబిజాతో శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా ల మధ్య పోటీ నెలకొంది. అయితే.. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో బ్యాట్‌తో పాటు బంతితో సత్తా చాటిన హార్దిక్ వైపే భారత్ మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఏంటి మామ.. భారత్ వర్సెస్ పాక్ ఫైనల్ మ్యాచ్ చూద్దామనుకుంటే ఇలా జరిగింది..?
వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ ఉండడంతో స్పెషలిస్ట్ బ్యాటర్ అవసరం అనుకుంటే తప్ప సంజూ శాంసన్‌కు జట్టులో చోటు దక్కడం కష్టమే. ఇక ఆరో స్థానంలో నయా ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్ ఆడడం దాదాపు ఖాయమే. ఇక తొలి టీ20 మ్యాచ్ జరగనున్న పల్లెకలె పిచ్ స్పిన్నర్లకు అనుకూలం ఉంటుంది. దీంతో భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లు స్పిన్ స్పెషలిస్టులుగా బరిలోకి దిగనుండగా, మూడో స్పిన్నర్ కావాలనుకుంటే రవిబిష్ణోయ్‌కు చోటు దక్కొచ్చు. ఇక అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌లు పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు.
ఈ ఆటగాళ్లు బెంచ్‌కే.!
సంజూ శాంసన్, శివమ్ దూబే, రియాన్ పరాగ్, ఖలీల్ అహ్మద్‌లకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం కాస్త కష్టమే.
తొలి టీ20కి భారత జట్టు(అంచనా)..
యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
