శ్రీలంకతో టీ20 మ్యాచ్‌కు ముందు.. ద్రవిడ్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న గంభీర్.. ‘ఇది నీకు కష్టం అని తెలుసు.. అయినా గానీ..’
మ్యాచ్‌కు ముందు గంభీర్‌కు రాహుల్ ద్రవిడ్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

Dravid Surprise Message Makes Gambhir Emotional
Dravid Surprise Message Makes Gambhir Emotional : భారత క్రికెట్ చరిత్రలో టీమ్ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ శకం ముగిసింది. టీ20 ప్రపంచకప్ సాధించి ద్రవిడ్ ఘనంగా వీడ్కోలు పలికాడు. కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్ వచ్చాడు. అతడి శిక్షణలో భారత జట్టు తొలి సిరీస్ ఆడేందుకు సిద్ధం అవుతోంది. నేడు (జూలై 27శనివారం) భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో మ్యాచ్‌కు ముందు గంభీర్‌కు రాహుల్ ద్రవిడ్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. కోచ్ పదవిని చేపట్టిన గంభీర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తన అనుభవాలను పంచుకున్నాడు.
‘హలో గౌతమ్.. భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ప్రపంచంలోనే అత్యంత ఉత్తేజకరమైన ఉద్యోగానికి స్వాగతం. భారత జట్టుతో నా ప్రయాణం ముగిసి మూడు వారాలు అవుతోంది. నేను కన్న కలలకు మించి ఎంతో గొప్పగా (టీ20 ప్రపంచకప్ విజయాన్ని ఉద్దేశిస్తూ) బార్సడోస్‌లో నా పదవికాలాన్ని ముగిచాను. అనంతరం ముంబైలో మరిచిపోలేని సాయంత్రం (ఘన స్వాగత కార్యక్రమాన్ని గురించి చెప్పాడు). వీటి అన్నింటికంటే ఎక్కువగా జట్టుతో నా స్నేహాలను, జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకుంటాను.’ అని ద్రవిడ్ అన్నాడు.
Mohammed Shami : మటన్‌కి షమీ బౌలింగ్‌కు సంబంధం ఏంటో తెలుసా..!
గౌతమ్ నువ్వు కోచ్‌గా బాధ్యతలు చేపట్టావు. నువ్వు కూడా ఇలాంటి అద్భుత సమయాన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ద్రవిడ్ ఆకాంక్షించాడు. ఇక అదృష్టం కూడా నీ వైపు ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు. తోటి ఆటగాడిగా మైదానంలో గంభీర్ ఉత్తమ ప్రదర్శన ఇవ్వడాన్ని చూశానని, బ్యాటింగ్ భాగస్వామిగా, సహచర ఫీల్డర్‌గా.. ఓటమిని అంగీకరించని అతడి దృఢత్వాని చూశానని ద్రవిడ్ తెలిపాడు. ఐపీఎల్ సీజన్లలో నీ కోచింగ్‌తో గెలవాలనే కసిని గమనించాను. మనపై అంచనాలు ఎలా ఉంటాయో నీకు తెలుసు. క్లిష్ణ పరిస్థితుల్లో ఉన్నప్పటికి ఊడా నువ్వు ఒంటరి వాడివి కాదు. ప్లేయర్లు, సహాయ సిబ్బంది, మేనేజ్‌మెంట్ నుంచి నీకు ఎల్లప్పుడూ మద్దతు ఉంటుంది. ఇది నీకు కష్టమైనప్పటికి కూడా.. అప్పుడప్పుడు కాస్త చిరునవ్వుతో కనిపించు అని ద్రవిడ్ వాయిస్ మెసేజ్ పంపాడు.
కాగా.. రాహుల్ ద్రవిడ్ పంపిన మెసేజ్ విని గంభీర్ భావోద్వేగానికి గురైయ్యాడు. ఎలా స్పందించాలో తనకు తెలియడం లేదన్నాడు. జట్టు కోసం ఏదైనా చేసే వ్యక్తి ద్రవిడ్ అని, అతడి నుంచి తనతో పాటు భవిష్యత్తు తరాలు ఎంతో నేర్చుకోవచ్చునని చెప్పాడు. తన పై ఉంచిన బాధ్యతను పారదర్శకంగా, నిజాయతీగా నిర్వర్తిస్తానని తెలిపాడు. ద్రవిడ్ గర్వపడేలా పదవిని చేపడతానని చెప్పుకొచ్చాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
??????? ?? ??? ????? ???? ????? & ?????! ?
To,
Gautam Gambhir ✉From,
Rahul Dravid ?#TeamIndia | #SLvIND | @GautamGambhir pic.twitter.com/k33X5GKHm0— BCCI (@BCCI) July 27, 2024