IND vs SL : శ్రీలంకతో టీ20 సిరీస్.. మొబైల్‌లో ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా..?
భారత్, శ్రీలంక జట్ల మధ్య టీ20 సిరీస్‌కు అంతా సిద్ధమైంది.
- Thota Vamshi Kumar
- Published On : July 27, 2024 / 02:46 PM IST
When and where to watch IND vs SL match online and on TV
India vs Sri Lanka : భారత్, శ్రీలంక జట్ల మధ్య టీ20 సిరీస్‌కు అంతా సిద్ధమైంది. కోచ్‌గా గౌతమ్ గంభీర్, కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు అందుకున్న తరువాత టీమ్ఇండియా ఆడనున్న తొలి సిరీస్ ఇదే. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా పల్లెకలె వేదికగా నేడు (జూలై 27 శనివారం) భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టీ20 ప్రపంచకప్ అనంతరం సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు పొట్టి ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో లంకతో సిరీస్ పై ఆసక్తి పెరిగింది.
2026 టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా భారత జట్టును సిద్ధం చేయాలని గంభీర్ భావిస్తున్నాడు. ఈ క్రమంలో టీమ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది..? సీనియర్ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు ఎవరు..? వంటివి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రెండు జట్ల బలాబలాలు చూసుకున్నా కూడా టీమ్ఇండియానే ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. స్వదేశంలో లంక జట్టును తక్కువగా అంచనా వేస్తే భారీ నష్టం తప్పదు.
IND vs SL : శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్.. సంజూ శాంసన్‌కు నో ప్లేస్..!
మరో వైపు టీ20 ప్రపంచకప్‌లో గ్రూపు స్టేజీ నుంచే లంక జట్టు నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. నాయకత్వ బాధ్యతల నుంచి హసరంగా తప్పుకోవడంతో చరిత్ అసలంకను లంక బోర్డు కెప్టెన్‌గా నియమించింది. సనత్ జయసూర్య తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. భారత్‌తో సిరీస్‌లో సత్తా చాటి ప్రపంచకప్ 2026లో తాము రేసులో ఉన్నామని చాటి చెప్పాలని లంక భావిస్తోంది.
మ్యాచుల ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..?
టీమ్ఇండియా విదేశాల్లో ఆడే మ్యాచులకు సంబంధించిన హక్కులు అన్నీ సోనీ నెట్‌వర్క్ సొంతం చేసుకుంది. శ్రీలంక మ్యాచులు అన్ని సోనీ స్పోర్ట్స్ టెన్ 3(హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 4(తమిళం/తెలుగు), సోనీ స్పోర్ట్స్ టెన్ 5 ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఓటీటీలో సోనీ లివ్ లో ప్రసారం అవుతాయి.
ఏంటి మామ.. భారత్ వర్సెస్ పాక్ ఫైనల్ మ్యాచ్ చూద్దామనుకుంటే ఇలా జరిగింది..?
ఫ్రీగా ఎలా చూడాలంటే..?
ఓటీటీలో సోనీ లివ్‌లో మ్యాచులు చూడాలంటే సబ్‌స్ర్కిప్షన్ తీసుకోవాలి. కాగా.. మొబైల్‌లో ఫ్రీగా చూడాలనుకుంటే జియోటీవీ యాప్‌లో చూడొచ్చు. జియో టీవీ యాప్‌లో ఛానెల్స్‌లో సోనీ టీవీ నెట్ వర్క్ ఛానెల్స్‌ను ఎంచుకోని చూడొచ్చు.
