WPL Auction 2023 LIVE Updates: విమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం అప్డేట్స్.. కోట్లు కొల్లగొట్టిన అమ్మాయిలు

 వేలంలో మొత్తం 87 మంది క్రికెటర్లను (వారిలో 30 మంది విదేశీ క్రికెటర్లు) కొనుగోలు చేశారు. అందుకు మొత్తం రూ.59.50 కోట్లు ఖర్చు చేశారు.

WPL Auction 2023 LIVE Updates: మొట్టమొదటి విమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నిర్వహణ కోసం ఇవాళ ముంబైలో వేలం జరిగింది. పురుషుల ఐపీఎల్ వంటి టీ20 టోర్నమెంట్ ఇది. భారత క్రికెటర్ స్మృతి మంధానను ఆర్సీబీ రూ.3.4 కోట్లకు దక్కించుకుంది. నటాలీ సివర్ ను ముంబై జట్టు రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఆమె ఇంగ్లండ్ బ్యాటర్. వేలంలో మొత్తం 87 మంది క్రికెటర్లను (వారిలో 30 మంది విదేశీ క్రికెటర్లు) కొనుగోలు చేశారు. అందుకు మొత్తం రూ.59.50 కోట్లు ఖర్చు చేశారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 13 Feb 2023 09:10 PM (IST)

    వేలంలో మొత్తం 87 మంది క్రికెటర్లను కొన్న జట్లు

    డబ్ల్యూపీఎల్ వేలం ముగిసింది. వేలంలో మొత్తం 87 మంది క్రికెటర్లను (వారిలో 30 మంది విదేశీ క్రికెటర్లు) కొనుగోలు చేశారు. అందుకు మొత్తం రూ.59.50 కోట్లు ఖర్చు చేశారు.

     

  • 13 Feb 2023 08:47 PM (IST)

    వేలంలో అమ్ముడుపోని గొంగడి వి.త్రిష

    హైదరాబాద్ అమ్మాయి గొంగడి వి.త్రిష డబ్ల్యూపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు. వేలంలో ఆమె బేస్ ధర రూ.10 లక్షలు మాత్రమే. ఆమెను కొనుగోలు చేసేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపలేదు. ఆమె సొంత ప్రాంతం భద్రాచలం.

  • 13 Feb 2023 08:14 PM (IST)

    ఎట్టకేలకు డబ్ల్యూపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన మాథ్యూస్

    దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ హేలీ మాథ్యూస్ (బేస్ ధర రూ.40 లక్షలు) ఎట్టకేలకు డబ్ల్యూపీఎల్ వేలంలో అమ్ముడుపోయింది. ఆమెను రూ.40 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. హేలీ మాథ్యూస్ తొలి రౌండ్లలో అమ్ముడుపోలేదు.

  • 13 Feb 2023 08:05 PM (IST)

    రేణుకా సింగ్ ఇంటి వద్ద సందడి

    డబ్ల్యూపీఎల్ లో భారత జట్టు క్రికెటర్ రేణుకా సింగ్ (27)ను ఆర్సీబీ రూ.1.5 కోట్లకు దక్కించుకోవడంతో ఆమె ఇంటి వద్ద కుటుంబ సభ్యులు స్వీట్లు పంచారు.

  • 13 Feb 2023 08:03 PM (IST)

    ఇప్పటివరకు ఏయే జట్టు ఎంత మందిని కొనుగోలు చేసింది?

    ఢిల్లీ క్యాపిటల్స్: 12 మంది
    గుజరాత్ జెయింట్స్: 13 మంది
    ముంబై ఇండియన్స్: 10 మంది
    ఆర్సీబీ: 11 మంది
    యూపీ వారియర్స్: 15 మంది

  • 13 Feb 2023 07:57 PM (IST)

    డబ్యూపీఎల్ వేలం దృశ్యాలు

  • 13 Feb 2023 07:44 PM (IST)

    తాజా రౌండ్ లో అమ్ముడుపోయిన క్రికెటర్లు వీరే

    దేవికా వైద్య- రూ.1.40 కోట్లు (యూపీ వారియర్స్)

    ఆలిస్ క్యాప్సీ - రూ.75 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
    గ్రేస్ హారిస్ - రూ.75 లక్షలు (యూపీ వారియర్స్)
    జార్జియా వేర్హామ్ - రూ.75 లక్షలు (గుజరాత్ జెయింట్స్)
    అమంజోత్ కౌర్ - రూ.50 లక్షలు (ముంబై ఇండియన్స్)
    లారా హారిస్ - రూ.45 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
    ఇసాబెల్లె వాంగ్ - రూ.30 లక్షలు (ముంబై ఇండియన్స్)
    సబ్బినేని మేఘన - రూ.30 లక్షలు (గుజరాత్ జెయింట్స్)
    కిరణ్ నవ్‌ఘైరే - రూ.30 లక్షలు (యూపీ వారియర్స్)
    ఎరిన్ బర్న్స్ - రూ.30 లక్షలు (ఆర్సీబీ)
    హీథర్ గ్రాహం - రూ.30 లక్షలు (ముంబై ఇండియన్స్)
    మాన్సీ జోషి - రూ.30 లక్షలు (జెయింట్స్)
    దయాళన్ హేమలత - రూ.30 లక్షలు (జెయింట్స్)
    లారెన్ బెల్ - రూ.30 లక్షలు (యూపీ వారియర్స్)
    మోనికా పటేల్ - రూ.30 లక్షలు (జెయింట్స్)
    మిన్ను మణి - రూ.30 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
    జసియా అఖ్తర్ - రూ.20 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
    తారా నోరిస్ - రూ.10 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
    ధారా గుజ్జర్ - రూ.10 లక్షలు (ముంబై ఇండియన్స్)
    దిశా కసత్ - రూ.10 లక్షలు (ఆర్సీబీ)
    లక్ష్మీ యాదవ్ - రూ.10 లక్షలు (యూపీ వారియర్స్)
    ఇంద్రాని రాయ్ - రూ.10 లక్షలు (ఆర్సీబీ)
    శ్రేయాంక పాటిల్ - రూ.10 లక్షలు (ఆర్సీబీ)

  • 13 Feb 2023 07:27 PM (IST)

    ఇప్పటివరకు అమ్ముడుపోని క్రికెటర్లు

    ప్రియా పునియా
    స్నేహ దీప్తి
    భారతీ ఫుల్మాలి
    కిమ్ గార్త్
    కేథరిన్ క్రంట్
    సిమ్రాన్ బహదూర్
    అనూజా పాటిల్
    స్వాగతికా రత్
    అరుంధతి రెడ్డి
    మేఘనా సింగ్
    గౌహెర్ సుల్తానా
    ఏక్తా బిష్త్
    ప్రీతి బోస్
    మహికా గౌర్
    దివ్య
    ఈశ్వరీ గొనెల్కర్
    షిప్రా గిరి
    అశ్వినీ కుమారి
    తరన్నమ్ పఠాన్
    సజన
    హుమిరా కాజీ

  • 13 Feb 2023 07:02 PM (IST)

    హీథర్ గ్రాహం, ఎరిన్ బర్న్స్ రూ.30 లక్షల చొప్పున..

    ఆస్ట్రేలియా క్రికెటర్లు హీథర్ గ్రాహం, ఎరిన్ బర్న్స్ ఇద్దరూ వేలంలో రూ.30 లక్షల చొప్పున ధర పలికారు. హీథర్ గ్రాహంను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకోగా, ఎరిన్ బర్న్స్ ను ఆర్సీబీ దక్కించుకుంది.

  • 13 Feb 2023 06:55 PM (IST)

    రూ.75 లక్షలకు ఆల్ రౌండర్ గ్రేస్ హారిస్

    ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్రేస్ హారిస్ ను రూ.75 లక్షలకు యూపీ వారియర్స్ దక్కించుకుంది.
    డబ్ల్యూపీఎల్ వేలంలో భారత బ్యాటర్ భారతి ఫుల్మాలి అమ్ముడుపోలేదు. ఆమె ఇప్పటివరకు 2 టీ20 మ్యాచులు మాత్రమే ఆడింది.

  • 13 Feb 2023 06:46 PM (IST)

    భారత క్రికెటర్ షఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేయడంతో దీనిపై ఆమె స్పందించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేసింది.

  • 13 Feb 2023 06:02 PM (IST)

    ఇప్పటివరకు ఏయే జట్లలో ఎవరు?

    ఆర్సీబీ: స్మృతి మంధాన, డివైన్, పెర్రీ, రేణుక, ఘోష్
    ముంబై: హర్మన్‌ ప్రీత్, నాట్ స్కివర్- బ్రంట్, అమెలియా కెర్, వస్త్రాకర్, యస్తికా
    గుజరాత్ జెయింట్స్: గార్డనర్, మూనీ, డాంక్లీ, సాదర్లాండ్, హర్లీన్, డొట్టిన్, రానా
    యూపీ వారియర్స్: ఎక్లెస్టోన్, దీప్తి శర్మ, మెక్‌ గ్రాత్, ఇస్మాయిల్, హీలీ, సర్వాని, గైక్వాడ్, చోప్రా, సెహ్రావత్, యశశ్రీ
    ఢిల్లీ క్యాపిటల్స్: రోడ్రిగ్స్, లానింగ్, షఫాలీ, రాధ, పాండే, మారిజాన్ కాప్, సాధు

    WPL 2023 Players Auction

  • 13 Feb 2023 05:56 PM (IST)

    రూ.10 లక్షలకు సొప్పదండి యశశ్రీ

    సొప్పదండి యశశ్రీని రూ.10 లక్షలకు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది.

  • 13 Feb 2023 05:52 PM (IST)

    చివరి బ్యాచ్ లో అమ్ముడుపోని క్రికెటర్లు

    సోనమ్ యాదవ్
    సోనియా మెంధియా
    షిఖా షాలో
    హర్లీ గాలా

     

     

  • 13 Feb 2023 05:45 PM (IST)

    వేలాన్ని లైవ్ లో చూస్తున్న టీమిండియా

  • 13 Feb 2023 05:42 PM (IST)

    రూ.40 లక్షలకు శ్వేతా సెహ్రావత్

    అండర్ 19 ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ శ్వేతా సెహ్రావత్ ను డబ్ల్యూపీఎల్ వేలంలో యూపీ వారియర్స్ రూ.40 లక్షలకు దక్కించుకుంది.

  • 13 Feb 2023 05:24 PM (IST)

    రూ.40 లక్షలు పలికిన క్రికెటర్లు..

    భారత క్రికెటర్ రాజేశ్వరి గైక్వాడ్ ను యూపీ వారియర్స్ జట్టు రూ.40 లక్షలకు సొంతం చేసుకుంది.
    భారత క్రికెటర్ రాధా యాదవ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.40 లక్షలకు దక్కించుకుంది.
    భారత క్రికెటర్ హర్లీన్ డియోల్ ను గుజరాత్ జెయింట్స్ రూ.40 లక్షలకు కొనుగోలు చేసింది.

  • 13 Feb 2023 05:11 PM (IST)

    భారీ ధర పలికిన భారత అమ్మాయిలు-వారి జట్లు

     WPL Players Auction LIVE

  • 13 Feb 2023 04:50 PM (IST)

    ఇప్పటివరకు అమ్ముడుపోని క్రికెటర్లు

    హేలీ మాథ్యూస్ (బేస్ ధర రూ.40 లక్షలు)
    సుజీ బేట్స్ (రూ.30 లక్షలు)
    తజ్మిన్ బ్రిట్స్ (రూ.30 లక్షలు)
    లారా వోల్వార్డ్ట్ (రూ.30 లక్షలు)
    టామీ బ్యూమాంట్ (రూ.30 లక్షలు)
    హీథర్ (రూ.40 లక్షలు)
    సునీ లుయుేస్ (రూ.30 లక్షలు)
    డేనీ వ్యాట్ (రూ.50 లక్షలు)

  • 13 Feb 2023 04:41 PM (IST)

    ఆర్సీబీ తరఫున ఆడనున్న రిచా ఘోష్

    భారత ఆల్ రౌండర్ రిచా ఘోష్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడనుంది. ఆమెను ఆర్సీబీ రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసింది. 2020లో ఆమె టీ20ల్లోకి ప్రవేశించింది.

  • 13 Feb 2023 04:29 PM (IST)

    యూపీ వారియర్స్ తరఫున ఆడనున్న దీప్తి శర్మ

    Sharma (Batting)

    భారత జట్టు ఆల్ రౌండర్ దీప్తి శర్మను యూపీ వారియర్స్ రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది.

     

  • 13 Feb 2023 04:23 PM (IST)

    రూ.1.5 కోట్లకు రేణుకా సింగ్

    డబ్ల్యూపీఎల్ లో భారత జట్టు క్రికెటర్ రేణుకా సింగ్ (27)ను ఆర్సీబీ రూ.1.5 కోట్లకు దక్కించుకుంది. ఆమె ఇప్పటివరకు కేవలం 20 టీ20 మ్యాచులే ఆడింది.

     

  • 13 Feb 2023 04:19 PM (IST)

    జెమిమా రోడ్రిగ్స్ ను కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్  

    జెమిమా రోడ్రిగ్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 2.20 కోట్లకు దక్కించుకుంది. ఆమె ఇప్పటివరకు మొత్తం 66 టీ20 మ్యాచులు ఆడింది.

  • 13 Feb 2023 04:13 PM (IST)

    రూ.2 కోట్లకు భారత క్రికెటర్ షఫాలీ వర్మ..

    భారత క్రికెటర్ షఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.

  • 13 Feb 2023 04:04 PM (IST)

    తహ్లియాను దక్కించుకున్న యూపీ వారియర్స్

    తహ్లియా మెక్ గ్రాత్ ను యూపీ వారియర్స్ రూ.1.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఆమె ఆస్ట్రేలియా ఆల్ రౌండర్.

  • 13 Feb 2023 04:01 PM (IST)

    రూ.3.2 కోట్లకు నటాలీ సివర్..

    నటాలీ సివర్ ను ముంబై జట్టు 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఆమె ఇంగ్లండ్ బ్యాటర్.

  • 13 Feb 2023 03:56 PM (IST)

    రూ.2 కోట్లకు బెత్ మూనీ

    Mooney (batting)

    బెత్ మూనీని గుజరాత్ జెయింట్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఆమె ఆస్ట్రేలియా వికెట్ కీపర్.

  • 13 Feb 2023 03:52 PM (IST)

    రూ.50 లక్షలకు సోఫీ డివైన్

    సోఫీ డివైన్ ను ఆర్సీబీ రూ.50 లక్షలకు దక్కించుకుంది. ఆమె న్యూజిలాండ్ క్రికెటర్. ఇప్పటివరకు 112 టీ20లు ఆడింది.

  • 13 Feb 2023 03:43 PM (IST)

    సోఫీ ఎక్లెస్టోన్ ను రూ.1.8 కోట్లకు దక్కించుకున్న యూపీ వారియర్స్

    సోఫీ ఎక్లెస్టోన్ ను యూపీ వారియర్స్ రూ.1.8 కోట్లకు దక్కించుకుంది. ఆమె ఇంగ్లండ్ ఆల్ రౌండర్. ఇప్పటివరకు సోఫీ 65 టీ20 మ్యాచులు ఆడింది.

  • 13 Feb 2023 03:35 PM (IST)

    రూ.1.7 కోట్లకు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎలిస్ పెర్రీ..

    ఎలిస్ పెర్రీని ఆర్సీబీ 1.7 కోట్లకు కొనుగోలు చేసింది. ఎలిస్ పెర్రీ ఆస్ట్రేలియా విమెన్స్ క్రికెట్ టీమ్ ఆల్ రౌండర్.

  • 13 Feb 2023 03:24 PM (IST)

    గార్డ్ నర్ ను రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ జెయింట్స్

    ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గార్డ్ నర్ ను రూ.3.2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ గార్డ్ నర్ బాగా రాణిస్తుంది. దీంతో ఆమెను అధిక గుజరాత్ జెయింట్స్ భారీ ధరకు దక్కించుకుంది.

  • 13 Feb 2023 03:20 PM (IST)

    హర్మన్ ప్రీత్ కౌర్ ను రూ.1.8 కోట్లకు దక్కించుకున్న ముంబై జట్టు

    హర్మన్ ప్రీత్ కౌర్ ను ముంబై జట్టు రూ.1.8 కోట్లకు దక్కించుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ ఇప్పటివరకు మొత్తం 137 టీ20లు ఆడింది.

  • 13 Feb 2023 03:16 PM (IST)

    స్మృతి మంధానను రూ.3.4 కోట్లకు దక్కించుకున్న ఆర్సీబీ

    Smriti Mandhana

    స్మృతి మంధానను ఆర్సీబీ రూ.3.4 కోట్లకు దక్కించుకుంది. స్మృతి మంధాన టీమిండియాలో కీలక ప్లేయర్. ఇప్పటివరకు ఆమె 105 టీ20లు ఆడింది.

ట్రెండింగ్ వార్తలు